Shreyas Iyer: బ్యాటుతోనే కాదు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకున్నాడు.. శ్రేయస్‌ డ్యాన్సింగ్‌ వీడియో వైరల్‌..

|

Nov 26, 2021 | 5:31 PM

అరంగేట్రం చేసిన టెస్టులోనే సెంచరీ సాధించి దిగ్గజాల పక్కన చోటు దక్కించుకున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. 171 బంతుల్లో 105 పరుగులు చేసిన అతను

Shreyas Iyer:  బ్యాటుతోనే కాదు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకున్నాడు.. శ్రేయస్‌ డ్యాన్సింగ్‌ వీడియో వైరల్‌..
Follow us on

అరంగేట్రం చేసిన టెస్టులోనే సెంచరీ సాధించి దిగ్గజాల పక్కన చోటు దక్కించుకున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. 171 బంతుల్లో 105 పరుగులు చేసిన అతను.. ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ కొట్టిన 16వ టీమిండియా క్రికెటర్‌గా ఖ్యాతి గడించాడు. న్యూజిలాండ్‌తో మొదటి ఇన్సింగ్స్‌లో భారత్‌ 345 పరుగులు సాధించిందంటే అది శ్రేయస్‌ చలవే. తన సొగసైన ఆటతీరుతో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోన్న ఈ ఆటగాడికి డ్యాన్స్‌లోనూ అద్భుతమైన ప్రతిభ ఉంది. గతంలో అతను ఎన్నో పాటలకు సూపర్బ్‌గా స్టెప్పులేయడం, అవి నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అతను సహచర క్రికెటర్లు రోహిత్‌ శర్మ, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి కాలు కదిపాడు. బాలీవుడ్‌ ‘షెహ్రీబాబూ ‘ రీమిక్స్‌కు ముగ్గురూ కలిసి అద్భుతంగా స్టెప్పులేశారు.

ఈ వీడియోలో శ్రేయస్‌ ముందుండి డ్యాన్స్‌ చేయగా, రోహిత్‌, శార్దూల్‌ అతడిని అనుకరిస్తూ స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురి క్రికెటర్లను చూసిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో వీడియో పోస్ట్‌ చేసిన రెండుగంటల్లోపే 7లక్షలకు పైగా లైకులు రావడం విశేషం. కాగా శ్రేయస్‌ గతంలో టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీవర్మతో కలిసి ఓ జిమ్‌లో సరదాగా స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Watch Video: ఇలా ఎలా జరిగిందబ్బా.. షాకవుతూ పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్‌..! వైరలవుతోన్న వీడియో

Virat Kohli: ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేం.. 26/11 ఉగ్ర దాడిపై విరాట్ కోహ్లీ ట్వీట్..

భారత విజయానికి ఒక వికెట్.. దక్షిణాఫ్రికా గెలిచేందుకు 6 పరుగులు.. చివరి ఓవర్ బౌల్ చేసిన లిటిల్ మాస్టర్.. ఫలితం ఏంటో తెలుసా? (వీడియో)