AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అయ్యో పాపం అయ్యర్‌! చెన్నై పై విజయం సాధించిన తప్పని నిరాశ.. కారణమిదే

ఐపీఎల్ 2025లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించినా, శ్రేయాస్ అయ్యర్‌కు నెమ్మదైన ఓవర్ రేట్ కారణంగా ₹12 లక్షల జరిమానా పడింది. చాహల్ హ్యాట్రిక్‌తో మెరిసి పంజాబ్ విజయానికి కీలకంగా నిలిచాడు. ధోని తిరిగి కెప్టెన్‌గా వచ్చినా, సీఎస్‌కే నిరాశజనకంగా ప్రదర్శించి ప్లే ఆఫ్స్ నుంచి తొలిగా ఎలిమినేట్ అయ్యింది. పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను బలపరిచింది, ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది.

Video: అయ్యో పాపం అయ్యర్‌! చెన్నై పై విజయం సాధించిన తప్పని నిరాశ.. కారణమిదే
Shreyas Iyer
Narsimha
|

Updated on: May 01, 2025 | 4:10 PM

Share

చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించినప్పటికీ, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం జరిగిన IPL 2025 మ్యాచ్‌లో మినిమం ఓవర్‌రేట్ ఉల్లంఘన కారణంగా BCCI ఆయనపై ₹12 లక్షల జరిమానా విధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చెన్నైపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచినా, నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తిచేయలేకపోవడంతో శ్రేయాస్‌ను శిక్షించారు.

19వ ఓవర్ మొదలయ్యే ముందు పంజాబ్ కింగ్స్ ఒక అదనపు ఫీల్డర్‌ను వలయానికి లోపలికి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా, చాహల్ అద్భుత హ్యాట్రిక్‌తో మ్యాచ్‌ను పంజాబ్‌కు చేజిక్కించాడు. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత రెట్టింపు అయ్యాయి. ప్రస్థుత పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలోకి వచ్చింది. పంజాబ్ కి ఇంక నాలుగు మ్యాచులు మిగిలి ఉన్నాయి. అందులో కనీసం రెండు మ్యాచులు గెలిస్తే పక్కగా ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం ఖాయం.

BCCI ప్రకటన ప్రకారం:

“శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్, పంజాబ్ కింగ్స్, IPL కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ సీజన్‌లో తొలి మినిమమ్ ఓవర్‌రేట్ నేరంగా పరిగణించబడినందున, రూ.12 లక్షల జరిమానా విధించబడింది.”

మ్యాచ్ హైలైట్స్:

శ్రేయాస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీ (72 పరుగులు, 41 బంతులు, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. యువజేంద్ర చాహల్ హ్యాట్రిక్‌తో 4 వికెట్లు (4/32) తో మెరిశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54 పరుగులు, 36 బంతులు) సమ్ కరన్ (88 పరుగులు, 47 బంతులు) మెరుగైన ప్రదర్శన చేశారు. మార్కో జాన్సన్ రెండు కీలక వికెట్లు తీసి చాహల్‌కు మద్దతిచ్చాడు ఇక CSK తరఫున మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో డెవాల్డ్ బ్రెవిస్ (32 పరుగులు) మద్దతిచ్చాడు. చివరగా, జట్టు విజయం సాధించినా ఓవర్ రేట్ లోపం శ్రేయాస్ అయ్యర్‌కు చుక్కలు చూపించిందని చెప్పవచ్చు.

ఐపీఎల్‌ 2025లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సీఎస్‌కే ఓటమి పాలైంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ధోని కెప్టెన్‌ అవ్వడంతో సీఎస్‌కే తలరాత మారుతుందని ఆశపడిన సీఎస్‌కే అభిమానులకు నిరాశే ఎదురైంది. ధోని కెప్టెన్సీలో కూడా సీఎస్‌కే ప్రదర్శన ఏం మారలేదు. ఇక పంజాబ్‌పై ఎదురైన ఓటమితో సీఎస్‌కే అధికారికంగా ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ రేసు నుంచి తప్పుకుంది. ఐపీఎల్‌ 2025 నుంచి ఎలిమినేట్‌ అయిన తొలి టీమ్‌గా చెత్త రికార్డును సీఎస్‌కే సొంతం చేసుకుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..