Shoaib Akhtar: షోయబ్‌ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. కోహ్లీ కంటే పెద్ద బ్యాట్స్‌మెన్‌ ఉన్నారట..!

| Edited By: Anil kumar poka

Oct 23, 2021 | 1:27 PM

Shoaib Akhtar: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్‌గా పేరు, ప్రఖ్యాతులు సంపాదించాడు. అతని బ్యాటింగ్ శైలిని

Shoaib Akhtar: షోయబ్‌ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. కోహ్లీ కంటే పెద్ద బ్యాట్స్‌మెన్‌ ఉన్నారట..!
Shoaib Akhtar
Follow us on

Shoaib Akhtar: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్‌గా పేరు, ప్రఖ్యాతులు సంపాదించాడు. అతని బ్యాటింగ్ శైలిని అందరు ఇష్టపడుతారు. అతడికి బౌలింగ్‌ చేయాలన్నా.. ఔట్‌ చేయాలన్నా బౌలర్లు విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. పాకిస్తాన్‌లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఒక విషయాన్ని ప్రస్తావించాడు. పాకిస్తాన్‌లో కూడా విరాట్‌ కోహ్లీకి అభిమానులు ఉన్నారని అయితే అతడి కంటే ఎక్కువగా అభిమానులు మరొక బ్యాట్స్‌మెన్‌కి ఉన్నారని బాంబు పేల్చాడు. అయితే ఆ బ్యాట్స్‌మెను రోహిత్ శర్మ.

అక్టోబర్ 24 న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య టి 20 ప్రపంచకప్ మ్యాచ్‌ జరగనుంది.ఈ సందర్భంగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వలో అక్తర్ మాట్లాడుతూ ” విరాట్‌ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్ కానీ అతనికంటే రోహిత్‌ శర్మ మరింత గొప్పవాడు. అతను ఇండియాలో ఇంజమామ్-ఉల్-హక్ లాంటివాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రిషబ్‌ పంత్‌ బ్యాటింగ్ చూసి ప్రజలు అభినందించారు. సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రశంసలందుకున్నాడు. పాకిస్తాన్ ప్రజలకు భారతదేశం గురించి మంచి అభిప్రాయం ఉంది. ఇండియాలో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నేను భారతదేశంలో చాలా ప్రేమను పొందిన పాకిస్థానీ అదృష్టవంతుడిని. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం లేదని” అన్నాడు.

ప్రపంచ కప్‌లో గొప్ప మ్యాచ్
అక్టోబర్ 24 న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య టి 20 ప్రపంచకప్ మ్యాచ్‌జరగనుంది. ఇప్పటి వరకు ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ ఒక్కసారి కూడా భారతదేశాన్ని ఓడించలేకపోయింది. ఏడుసార్లు వన్డే వరల్డ్ కప్‌లో, ఐదుసార్లు టీ 20 వరల్డ్ కప్‌లో ఓడించింది. అంతేకాదు పాకిస్తాన్‌ను ఓడించి తన మొదటి టీ 20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ రెండు జట్లు చివరిసారిగా ప్రపంచకప్ 2019 లో తలపడ్డాయి.

Bigg Boss 5 Telugu: తమ కష్టాలు గుర్తుకు చేసుకున్న కంటెస్టెంట్స్‌…ఎమోషనల్‌ అయిన ప్రియ, సిరి

Trailer Talk: కొత్త కోణాన్ని చూపించిన సుహాస్‌.. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు మర్డర్‌లు.. ఫ్యామిలీ డ్రామా ట్రైలర్‌ అదుర్స్‌..

66 బంతుల్లో 96 పరుగులు.. కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన 23 ఏళ్ల కుర్రాడు..