నితీశ్ కుమార్ రెడ్డి.. ఐపీఎల్ 2024 సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు కుర్రాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫునల బరిలోకి దిగిన ఈ వైజాగ్ కుర్రాడు తన ధనాధన్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి భారీ స్కోర్లు చేస్తూ ఎస్ఆర్‌హెచ్‌ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం ఐపీఎల్ 2024 సీజన్ లో 303 పరుగులు చేశాడీ యంగ్ క్రికెటర్. దీంతో టీ20 వరల్డ్ కప్ జట్టులో నితీశ్ రెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే జట్టులో అప్పటికే టీమ్ లో పోటీ ఎక్కువగా ఉండడంతో బీసీసీఐ తెలుగబ్బాయి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ప్రపంచకప్ తర్వాత ప్రారంభమయ్యే జింబాబ్వేతో టీ 20 సిరీస్ కు నితీశ్ రెడ్డిని ఎంపిక చేసింది. దీంతో టీమిండియాలోకి మరో తెలుగబ్బాయి వచ్చాడని క్రికెట్ అభిమానులు ఆనంద పడ్డారు. కానీ ఒక్కరోజులోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. జింబాబ్వే టూర్ కు జట్టును ఎంపిక చేసిన 24 గంటల్లోనే బీసీసీఐ పిడుగులాంటి వార్త చెప్పింది.
గాయం కారణంగా జింబాబ్వే పర్యటన నుంచి నితీశ్ కుమార్ రెడ్డిని తప్పిస్తున్నట్లు, అతని స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేను జట్టులోకి తీసుకుంటున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసే బంగారు అవకాశాన్ని కోల్పోయాడు నితీశ్ రెడ్డి. అయితే కావాలనే నితీశ్ రెడ్డిని జింబాబ్వే టూర్ నుంచి తప్పించారని నెటిజన్లు, కొందరు క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను ఏ క్రికెట్ టోర్నమెంట్ లోనూ ఆడడం లేదని, అలాంటప్పుడు గాయం ఎక్కడ అవుతుందని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒకవేళ అతను గాయపడినా జట్టులోకి ఎంపిక చేసేటప్పుడు బీసీసీఐకి తెలియదా? 24 గంటల తర్వాత మళ్లీ ఎందుకు అతనిని తొలగించారని బీసీసీఐ తీరును ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్లేయర్లపై బీసీసీఐ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని చాలామంది భారత క్రికెట్ బోర్డుపై మండి పడుతున్నారు.
🚨 NEWS 🚨
Shivam Dube replaces Nitish Reddy in the #TeamIndia squad for the series against Zimbabwe. #ZIMvIND
Details 🔽https://t.co/WMktNAIDIx
— BCCI (@BCCI) June 26, 2024
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రితురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవీష్‌నోయ్, అవీష్‌నోయ్, అవీష్ణోయ్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే.
భారతదేశం జింబాబ్వే టూర్ షెడ్యూల్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..