టీమిండియాకు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ దొరికేశాడ్రోయ్.. ఇతని ముందు అభిషేక్, వైభవ్ కూడా వేస్టే..!

Team India Cricketm All-Format Player: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులతో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 80 పరుగులతో ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు బాదాడు. వైట్ బాల్ క్రికెట్‌లో ఇప్పటికే తన సత్తా చాటిన ఇషాన్, ఇప్పుడు టెస్టుల్లోనూ తన విశ్వరూపం చూపిస్తూ టీమిండియాకు ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాడు.

టీమిండియాకు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ దొరికేశాడ్రోయ్.. ఇతని ముందు అభిషేక్, వైభవ్ కూడా వేస్టే..!
Team India Cricket All Format Player

Updated on: Sep 12, 2026 | 8:15 AM

Team India Cricketm All-Format Player: ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరు క్రికెట్ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. సౌత్ జోన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ 28 ఏళ్ల యువ ఆటగాడు, తొలి ఇన్నింగ్స్‌లో అసాధారణమైన డబుల్ సెంచరీతో ఏకంగా 270 పరుగుల భారీ స్కోరు సాధించాడు. కేవలం భారీ స్కోరుతోనే ఆగకుండా, రెండో ఇన్నింగ్స్‌లో కూడా 80 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా ఒకే మ్యాచ్‌లో 350 పరుగుల అద్భుతమైన ప్రదర్శనతో ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు.

ఒక్కమ్యాచ్ కే పరిమితం కాలే..

ఈ దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ ప్రదర్శన కేవలం ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. టోర్నమెంట్ మొత్తంలో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ, అలాగే ఒక అర్ధ సెంచరీతో బ్యాట్‌తో తన సత్తా చాటాడు. టెస్టు క్రికెట్‌లో అవకాశం పొందడం అంత తేలిక కాదు, ఎందుకంటే ఇప్పటికే అక్కడ విపరీతమైన పోటీ ఉంది. అయితే, ఇషాన్ కిషన్ తన వైట్ బాల్ క్రికెట్ కెరీర్‌లో తన విధ్వంసం ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచానికి నిరూపించాడు. ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లో కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!

ఇవి కూడా చదవండి

అందరి కళ్లు అతనిపైనే..

ఈ దులీప్ ట్రోఫీలో అందరి కళ్లూ కొన్ని ఇతర యువ ఆటగాళ్లపై ఉన్నప్పటికీ, టోర్నమెంట్ ముగిసేసరికి ఇషాన్ కిషన్ హీరోగా మారాడు. ఉదాహరణకు, ఇదే దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఒక అర్ధ సెంచరీ తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీనిని బట్టి ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి వస్తే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మల కంటే చాలా మెరుగైన ప్రదర్శన ఇస్తాడు అనడంలో సందేహం లేదు. గతంలో, కెరీర్ ఆరంభంలో చేసిన చిన్నపాటి తప్పుల వలన ఇషాన్ కిషన్ తన కెరీర్‌ను రిస్క్‌లో పెట్టుకున్నాడు. లేదంటే ఈపాటికే అన్ని ఫార్మేట్లలో సూపర్ స్టార్ హోదాలో ఉండాల్సినవాడు.

ఎక్కువమంది చదివినది: Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు..

అయినప్పటికీ, ఈ ఏడాది టీమిండియా తరపున రీఎంట్రీ ఇచ్చిన అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అతడు, ఇప్పుడు టెస్టుల్లో కూడా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత ప్రదర్శనలను బట్టి చూస్తే, త్వరలోనే టెస్టుల్లో కూడా రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇషాన్ కిషన్ తన నిలకడైన ప్రదర్శనలతో టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కీలకంగా మారే సత్తా ఉందని నిరూపించుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us