Video: గెలిచిన ఆనందంలో గంభీర్‌ను కిస్ చేసిన షారూఖ్.. భావోద్వేగంతో నరైన్ ఏంచేశాడంటే?

Shah Rukh Khan Hugs and kisses KKR Mentor Gautam Gambhir: గౌతమ్ గంభీర్ KKR మెంటార్‌గా జట్టుకు చాలా సహకారం అందించాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని నాయకత్వంలో జట్టు రెండు ట్రోఫీలను గెలుచుకుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత, KKR మరోసారి విజయం సాధించింది.

Video: గెలిచిన ఆనందంలో గంభీర్‌ను కిస్ చేసిన షారూఖ్.. భావోద్వేగంతో నరైన్ ఏంచేశాడంటే?
Shah Rukh Kiss Gautam Gambi

Updated on: May 27, 2024 | 11:27 AM

Shah Rukh Khan Hugs and kisses KKR Mentor Gautam Gambhir: సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో షారూఖ్ ఖాన్ సొంతం చేసుకున్న కేకేఆర్ జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్‌కు ఇది మూడో ట్రోఫీ. షారూఖ్ ఖాన్ తన పిల్లలు సుహానా ఖాన్, అబ్రామ్ ఖాన్, ఆర్యన్ ఖాన్‌లతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 113 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. ఈ లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించి సులువైన విజయాన్ని అందుకుంది.

కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్‌కి షారూఖ్ ఖాన్ హగ్ ఇచ్చాడు. ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు. గౌతమ్ గంభీర్ KKR మెంటార్‌గా జట్టుకు చాలా సహకారం అందించాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని నాయకత్వంలో జట్టు రెండు ట్రోఫీలను గెలుచుకుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత, KKR మరోసారి విజయం సాధించింది.

KKR గెలిచిన తర్వాత షారుక్ ఖాన్ సంబరాలు అంబరాన్ని అంటాయి. కూతురు సుహానాకు షారూఖ్ ఖాన్ స్వాగతం పలికాడు. అలాగే, ఈ విజయంతో సుహానా భావోద్వేగానికి గురైంది. ఈ విజయంతో షారూఖ్ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేకేఆర్ టీమ్‌కు ఎంతో సహకారం అందించిన సునీల్ నరైన్ మాత్రం.. గౌతమ్ గంభీర్‌తో సంబరాలు చేసుకున్నాడు. 15 మ్యాచ్‌లు ఆడిన సునీల్ 488 పరుగులే కాకుండా 17 వికెట్లు తీశాడు. అతనికి అత్యంత విలువైన ఆటగాడు అవార్డు లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..