Cricket History: బుమ్రానే భయపెట్టేశాడుగా.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే అరుదైన లిస్ట్‌లో ఆసీస్ పేసర్..!

Australia vs West Indies Test Series: ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి ఆధిక్యంలో ఉంది. బోలాండ్ వంటి పేసర్ల అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది.

Cricket History: బుమ్రానే భయపెట్టేశాడుగా.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే అరుదైన లిస్ట్‌లో ఆసీస్ పేసర్..!
Scott Boland, Jasprit Bumra

Updated on: Jul 14, 2025 | 3:32 PM

Cricket History: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ టెస్ట్ క్రికెట్‌లో సంచలన రికార్డు సృష్టించి చరిత్రలో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో, ఒక అరుదైన ఎలైట్ జాబితాలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

జమైకాలోని సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో బోలాండ్ 34 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి (3-34) అద్భుతంగా రాణించాడు. ఈ ప్రదర్శనతో అతని టెస్ట్ బౌలింగ్ సగటు కేవలం 17.33కి పడిపోయింది. ఇది 1915 నుంచి టెస్ట్ క్రికెట్‌లో కనీసం 2000 బంతులు వేసిన బౌలర్లలో అత్యుత్తమ బౌలింగ్ సగటుగా నిలిచింది. ఈ అద్భుతమైన ఘనతతో బోలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

చరిత్రలో స్కాట్ బోలాండ్ స్థానం..

ఆధునిక టెస్ట్ క్రికెట్‌లో, అంటే 1900 నుంచి కనీసం 2000 బంతులు వేసిన బౌలర్లలో, స్కాట్ బోలాండ్‌కు ముందు ఉన్న ఏకైక బౌలర్ ఇంగ్లాండ్ దిగ్గజం సిడ్నీ బర్న్స్ (16.43 సగటు). అంటే, గత 110 సంవత్సరాలలో స్కాట్ బోలాండ్ అత్యుత్తమ సగటుతో బౌలింగ్ చేసిన ఘనతను సాధించాడు. 1800లలో ఆడిన మరికొందరు బౌలర్లకు మాత్రమే బోలాండ్ కంటే మెరుగైన సగటు ఉంది. అది టెస్ట్ క్రికెట్ ఆరంభ రోజులు కాబట్టి అప్పటి పరిస్థితులు వేరు.

జస్‌ప్రీత్ బుమ్రా కూడా టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ సగటు కలిగిన బౌలర్లలో ఒకడు. అతని సగటు సుమారు 19.50 గా ఉంది. అయితే, స్కాట్ బోలాండ్ తన తాజా ప్రదర్శనతో బుమ్రాను అధిగమించి ఈ ప్రతిష్టాత్మకమైన జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించాడు.

వెస్టిండీస్‌పై బోలాండ్ ప్రభావం..

ఈ టెస్టులో ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిలో బోలాండ్ కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ టాప్ స్కోరర్ జాన్ క్యాంప్‌బెల్ (36 పరుగులు)ను అవుట్ చేసి వెస్టిండీస్‌కు గట్టి షాకిచ్చాడు. ఆ వెంటనే షాయ్ హోప్ (23 పరుగులు)ను తన పేస్, ఖచ్చితమైన సీమ్ బౌలింగ్‌తో అవుట్ చేశాడు. చివరకు షమర్ జోసెఫ్ వికెట్ తీసి వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చి, ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు.

ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి ఆధిక్యంలో ఉంది. బోలాండ్ వంటి పేసర్ల అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా, బోలాండ్ తన చిన్న టెస్ట్ కెరీర్‌లోనే 50కి పైగా వికెట్లు తీసి తన సగటును 17.66 వద్ద నిలబెట్టుకోవడం అతని సామర్థ్యానికి నిదర్శనం. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న ఆస్ట్రేలియా బౌలింగ్ దళంలో బోలాండ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..