Guinness World Record: వామ్మో ఇదేం షాట్ గురూ.. ఆంధ్రా ప్లేయర్ దెబ్బకు 10 ఏళ్ల చరిత్ర కనుమరుగు..

|

Jul 19, 2023 | 1:51 PM

Satwiksairaj Rankireddy: చిరాగ్ శెట్టితో కలిసి ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 గెలిచిన సాత్విక్.. మే 2013లో మలేషియాకు చెందిన టాన్ బూన్ హియోంగ్ నెలకొల్పిన 493 కి.మీ.ల వేగంతో దశాబ్ద కాలం నాటి రికార్డును బద్దలు కొట్టాడు.

Guinness World Record: వామ్మో ఇదేం షాట్ గురూ.. ఆంధ్రా ప్లేయర్ దెబ్బకు 10 ఏళ్ల చరిత్ర కనుమరుగు..
Satwiksairaj Rankireddy
Follow us on

Satwiksairaj Rankireddy: భారత స్టార్‌ ప్లేయర్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి బ్యాడ్మింటన్‌లో గంటకు 565 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగంగా ‘హిట్‌’ చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. ఇటీవలే చిరాగ్ శెట్టితో కలిసి ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టైటిల్‌ను గెలుచుకున్న సాత్విక్.. మే 2013లో మలేషియాకు చెందిన టాన్ బూన్ హియోంగ్ నెలకొల్పిన 493 కి.మీ.ల వేగంతో దశాబ్ద కాలం నాటి రికార్డును కూడా బద్దలు కొట్టాడు. నిజానికి, సాత్విక్ స్మాష్ ఫార్ములా వన్ కారు సాధించిన 372.6 kmph వేగం కంటే వేగంగా ఉంది.

మహిళల విభాగంలో మెరిసిన మలేషియా ప్లేయర్..

అదే సమయంలో మహిళల విభాగంలో గంటకు 438 కి.మీ వేగంతో షూట్ చేసిన రికార్డ్ మలేషియాకు చెందిన టెన్ పెర్లీ పేరిట నిలిచింది. యోనెక్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి (భారత్), టెన్ పెర్లీ (మలేషియా) వరుసగా పురుషుల, మహిళల బ్యాడ్మింటన్‌లలో అత్యంత వేగవంతమైన షాట్‌లు సాధించారని యోనెక్స్ గర్వంగా ప్రకటించింది. దీంతో వీరు కొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించారని తెలిపింది.

14 ఏప్రిల్ 2023న రికార్డ్..

వాస్తవానికి, ప్రపంచ రికార్డు 14 ఏప్రిల్ 2023న నమోదైంది. ఆ రోజు వేగాన్ని కొలిచే ఫలితాల ఆధారంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక న్యాయమూర్తులచే నిర్ధారించారు. జపాన్‌లోని సైతామాలోని సోకాలోని యోనెక్స్ ఫ్యాక్టరీ వ్యాయామశాలలో సాత్విక్ ఈ స్మాష్ చేశాడు. ఇటీవల చిరాగ్ శెట్టితో కలిసి భారత స్టార్ ప్లేయర్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టైటిల్‌ను గెలుచుకోవడం గమనార్హం. అదే సమయంలో, ఇప్పుడు ఈ ఆటగాడు తన పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..