AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు స్వింగ్‌తో సంచలనం.. కట్‌చేస్తే.. నేడు జట్టులో నో ప్లేస్.. కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడేసిన బీసీసీఐ..

Ind Vs WI: టీమిండియా తన బలమైన ఆటగాళ్ళలో ఒకరిని తీవ్రంగా కోల్పోతోంది. బీసీసీఐ ఈ ఆటగాడి క్రికెట్ కెరీర్‌ను దాదాపుగా ముగించిందని తెలుస్తోంది. ఇప్పుడు భారత టెస్టు, వన్డే జట్టులో ఈ ఆటగాడు రీఎంట్రీ ఇవ్వడం అసాధ్యమనిపిస్తోంది. భారత క్రికెట్ జట్టులోని ఈ ఆటగాడు మొదట టెస్ట్ జట్టు నుంచి తొలగించారు.

నాడు స్వింగ్‌తో సంచలనం.. కట్‌చేస్తే.. నేడు జట్టులో నో ప్లేస్.. కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడేసిన బీసీసీఐ..
Bhuvneshwar Kumar
Venkata Chari
|

Updated on: Jul 19, 2023 | 12:52 PM

Share

Bhuvneshwar Kumar: టీమిండియా తన బలమైన ఆటగాళ్ళలో ఒకరిని తీవ్రంగా కోల్పోతోంది. బీసీసీఐ ఈ ఆటగాడి క్రికెట్ కెరీర్‌ను దాదాపుగా ముగించిందని తెలుస్తోంది. ఇప్పుడు భారత టెస్టు, వన్డే జట్టులో ఈ ఆటగాడు రీఎంట్రీ ఇవ్వడం అసాధ్యమనిపిస్తోంది. భారత క్రికెట్ జట్టులోని ఈ ఆటగాడు మొదట టెస్ట్ జట్టు నుంచి తొలగించారు. ఆపై టీ20 జట్టు నుంచి పంపించేశారు. ఇక తాజాగా ఈ క్రికెటర్‌ను వన్డే జట్టు నుంచి పక్కనపెట్టేశారు. వెస్టిండీస్ పర్యటనకు సెలక్టర్లు ఒక ఆటగాడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. అంతకుముందు అంటే ఇదే సంవత్సరంలో న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఈ ఆటగాడిని జట్టుతో చేర్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టులోని ఈ ఆటగాడి టెస్టు, వన్డే, టీ20 కెరీర్ ముగిసినట్లేనని సంకేతాలు వస్తున్నాయి.

ఈ ఆటగాడి కెరీర్‌ను అర్థాంతరంగా ముగించిన బీసీసీఐ..

టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వన్డే, టీ20 కెరీర్ టెస్టు దాదాపు ముగిసింది. ఇక ఈ క్రికెటర్‌కు రిటైర్మెంట్ మాత్రమే మిగిలి ఉందని మాజీలు అంటున్నారు. భువనేశ్వర్ కుమార్ 21 జనవరి 2022న దక్షిణాఫ్రికాతో టీమిండియా తరపున తన చివరి వన్డే ఆడాడు. ఇది కాకుండా, భువనేశ్వర్ కుమార్ 22 నవంబర్ 2022న న్యూజిలాండ్‌తో టీమిండియా తరపున తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. 2018 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో జరిగిన జోహన్నెస్‌బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో భువీ అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కానీ ఆ తర్వాత భువీ టెస్ట్ కెరీర్ దాదాపు ముగిసినట్లైంది.

టీమిండియాకు భారీ నష్టం..

ఇప్పటి వరకు భువనేశ్వర్ కుమార్‌కు భారత టెస్టు జట్టులో అవకాశం రాలేదు. టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు భువనేశ్వర్ కుమార్ అతిపెద్ద బలం. భువనేశ్వర్ కుమార్ బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. అవసరమైనప్పుడు, అతను బ్యాట్‌తో మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు కూడా వెనుకాడడు. భువనేశ్వర్ కుమార్ జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 2018లో తన చివరి టెస్టు మ్యాచ్‌లో 63 పరుగులు చేసి 4 భారీ వికెట్లు కూడా పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియాలోకి తిరిగి రావడం అసాధ్యమే..

మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ వంటి అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు ప్రస్తుతం భారత వన్డే, టెస్టు జట్టులో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఇది కాకుండా జస్ప్రీత్ బుమ్రా కూడా ఇంకా తిరిగి రాలేదు. ఈ ఫాస్ట్ బౌలర్లందరూ ఈ రోజుల్లో తమ తుఫాను ప్రదర్శనతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ బౌలర్లతో భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు భారత వన్డే, టెస్టు జట్టులోకి తిరిగి రావడం అసాధ్యంగా మారింది. చాలా మ్యాచ్‌లలో టీమిండియా ఓటమికి భువనేశ్వర్ కుమార్ కూడా కారణంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు సెలక్టర్లు ఈ ఆటగాడికి టీమిండియా నుంచి బయటకు దారి చూపించారు. ఈ ఏడాది జనవరి 2023లో శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్‌ను టీమిండియాలో చేర్చలేదు.

వన్డే జట్టు నుంచి కూడా..

జనవరి 2023లోనే సెలెక్టర్లు భువనేశ్వర్ కుమార్‌కు న్యూజిలాండ్‌తో వన్డే, T20 సిరీస్‌లకు అవకాశం ఇవ్వలేదు. మార్చి 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లోనూ మొండిచేయి చూపించారు. భువనేశ్వర్ కుమార్ ఏడాది క్రితం 21 జనవరి 2022న దక్షిణాఫ్రికాతో టీమిండియా తరపున తన చివరి వన్డే ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత భువనేశ్వర్ కుమార్ వన్డే జట్టు నుంచి తప్పుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు పేస్ కోల్పోయాడు. మొదట్లో అతనికి కచ్చితత్వం ఉండేంది. దీంతో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడ. భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన గత కొంతకాలంగా పతనమైంది. భువనేశ్వర్ కుమార్ పేస్‌లోనూ వేడి తగ్గింది. దీంతో తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లో భయాన్ని సృష్టించలేకపోతున్నాడు. భువనేశ్వర్ కుమార్ గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ 2022, ఆసియా కప్ 2022 లో టీమిండియా ఓటమికి అతిపెద్ద విలన్‌గా మారాడు. భారీగా పరుగులు ఇవ్వడంతో టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..