Sanju Samson: సంజూకి టైమొచ్చింది.. బంగ్లాదేశ్‌ టూర్‌లో వన్డేలతో పాటు టెస్టుల్లోకి కూడా!

|

Dec 01, 2022 | 4:56 PM

ఆదివారం (డిసెంబర్‌4) ప్రారంభంకానున్న బంగ్లాదేశ్‌ పర్యటనలో వన్డేలతో పాటు టెస్టుల్లోనూ శాంసన్‌ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డేలో రెగ్యులర్‌ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయపడటంతో అతని స్థానాన్ని సంజూతో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Sanju Samson: సంజూకి టైమొచ్చింది.. బంగ్లాదేశ్‌ టూర్‌లో వన్డేలతో పాటు టెస్టుల్లోకి కూడా!
Sanju Samson, Rishab Pant
Follow us on

అద్భుతమైన ట్యాలెంట్‌, టెక్నిక్‌, ఎలాంటి పరిస్థితుల్లో నైనా దూకుడు చూపే తత్వం, వికెట్‌ కీపింగ్‌.. ఇలా ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ ఆకట్టుకుంటున్నాడు టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ సంజూశామ్సన్‌. అయితే అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లూ అతనికి అవకాశాలు మాత్రం రావడం లేదు. దీనిపై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలోనూ అతను రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో సంజూకు మొండి చేయి చూపిస్తోన్న టీమండియా కెప్టెన్లు, మేనేజ్‌మెంట్, బీసీసీఐ అతని అభిమానులు గుర్రుగా ఉంటున్నారు. అయితే ఆదివారం (డిసెంబర్‌4) ప్రారంభంకానున్న బంగ్లాదేశ్‌ పర్యటనలో వన్డేలతో పాటు టెస్టుల్లోనూ శాంసన్‌ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డేలో రెగ్యులర్‌ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయపడటంతో అతని స్థానాన్ని సంజూతో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా బంగ్లా టూర్‌ కోసం మొదట ఎంపిక చేసిన భారత జట్టులో (వన్డేలు, టెస్ట్‌లు) శాంసన్‌కు చోటు దక్కలేదు. అయితే పంత్‌ గాయపడడంతో అతని స్థానంలో సంజూకు స్థానం కల్పించారు. తద్వారా పంత్‌కు అధిక ప్రాధాన్యత ​ఇస్తున్నారని, సంజూకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్న అపవాదును చెరిపి వేసుకోవాలనుకుంటోంది బీసీసీఐ. మరోవైపు పంత్‌ గాయంపై ఎలాంటి అధికారిక సమాచారం‍ లేనప్పటికీ.. అతను తీవ్రమైన వెన్నునొప్పితోనే ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అతని స్కానింగ్‌ రిపోర్టు వచ్చిందని, నెల నుంచి రెండు నెలల వరకు విశ్రాంతి అవసరమని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌

  • మొదటి వన్డే: డిసెంబరు 4- ఆదివారం
  • రెండో వన్డే: డిసెంబరు 7- బుధవారం- షేర్‌- ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియం- ఢాకా
  • మూడో వన్డే: డిసెంబరు 10- శనివారం- షేర్‌- ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియం- ఢాకా

(ఈ మ్యాచ్‌లన్నీ ఢాకాలోని షేర్‌- ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతాయి.)

టెస్ట్ సిరీస్

  • మొదటి టెస్టు డిసెంబరు 14- 18: జహూర్‌ అహ్మద్‌ చౌదరి స్టేడియం, చట్టోగ్రామ్‌
  • రెండో టెస్టు డిసెంబరు 22- 26: షేర్‌ ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియం, ఢాకా

భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మ్యాచ్‌లు ఆరంభమవుతాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..