ట్యాలెంట్ ఉన్న టీమిండియాలో చోటు దక్కించుకోని సంజూశామ్సన్ రంజీ ట్రోఫీ2022-23 లో అదరగొట్టాడు. ఈరోజు (డిసెంబర్ 13) జార్ఖండ్‌తో మొదలైన మ్యాచ్‌లో కేరళ కెప్టెన్ రెచ్చిపోయాడు. మొత్తం 108 బంతుల్లో 72 పరుగులు చేసి కేరళ భారీస్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఏకంగా 7 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండడం విశేషం. అతనికి తోడు రోహన్ కున్నుమ్మల్ (50), రోహన్ ప్రేమ్ (79) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది కేరళ జట్టు. ప్రస్తుతం అక్షయ్ చంద్రన్ (39), సిజోమోన్ జోసఫ్ (28) క్రీజ్‌లో ఉన్నారు. ఇక జార్ఖండ్ బౌలర్లలో షాబాజ్ నదీమ్ 3 వికెట్లు పడగొట్టగా, ఉత్కర్ష్ సింగ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా నయా సెన్సేషన్ ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
కాగా బంగ్లాదేశ్ పర్యటనలో గాయపడ్డ రిషబ్ పంత్ స్థానంలో సంజూశామ్సన్‌ను ఎంపిక చేస్తారని అతని అభిమానులు ఆశించారు. వన్డే జట్టుతో పాటు టెస్టుల్లోనూ ప్లేస్ దక్కుతుందని భావించారు. అయితే ఎప్పటిలాగే మరోసారి బీసీసీఐ మొండిచేయి చూపింది. దీంతో రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. కేరళ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మరి రంజీ ట్రోఫీలో ప్రదర్శనను ఎక్కవ ప్రామాణికంగా తీసుకునే బీసీసీఐ సంజూను టీమిండియాలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.
Red-ball cricket after 3 years, back to business instantly.
Sanju Samson. ?? pic.twitter.com/uhX0ezt1Tx
— Rajasthan Royals (@rajasthanroyals) December 13, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..