AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TNPL 2025: ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 12 సిక్సర్లతో 198 పరుగులు.. ఫ్రాంచైజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన అశ్విన్ ఫ్రెండ్

Tamil Nadu Premier League 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 తర్వాత, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఈ లీగ్‌లో, ఐపీఎల్ తిరస్కరించిన ఆటగాళ్లు తమ బ్యాట్‌లతో పరుగుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా, ఐపీఎల్‌లో ఆడిన క్రికెటర్లు కూడా ఈ లీగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు.

TNPL 2025: ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 12 సిక్సర్లతో 198 పరుగులు.. ఫ్రాంచైజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన అశ్విన్ ఫ్రెండ్
Shivam Singh Tnpl 2025
Venkata Chari
|

Updated on: Jun 15, 2025 | 10:00 AM

Share

Shivam Singh Played Key Innings in Tamil Nadu Premier League 2025: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025 ఉత్కంఠ దశకు చేరుకుంది. ఈ లీగ్‌లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తిరస్కరణకు గురైన ఆటగాళ్లు ఈ లీగ్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నారు. TNPL 11వ మ్యాచ్‌లో ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆటగాడు అందరూ ఆశ్చర్యపోయే విధంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌లో ఈ ఆటగాడు ఇప్పుడు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో, అతను 12 భారీ సిక్స్‌లు కూడా బాదాడు. కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 198 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ రెండుసార్లు నాట్ ఔట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో, మాజీ టీం ఇండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

శివం సింగ్ మెరుపులు..

ఇవి కూడా చదవండి

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్‌లో సాలెం స్పార్టన్స్ (Salem Spartans) తరపున ఆడిన శివం సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 39 బంతుల్లో 70 పరుగులు సాధించి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాట్‌తో రాణించడం విశేషం. TNPL లో భాగంగా 11వ మ్యాచ్ సీచెమ్ మధురై పాంథర్స్ వర్సెస్ దిండిగల్ డ్రాగన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో, దిండిగల్ డ్రాగన్ ఓపెనర్ శివం సింగ్ 41 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేసి, 45 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో తన జట్టును విజయపథంలో నడిపించాడు. జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కూడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు.

రవిచంద్రన్ అశ్విన్ అండ..

అశ్విన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. శివమ్ సింగ్‌తో కలిసి, మొదటి వికెట్‌కు 64 బంతుల్లో 124 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. జట్టును విజయపు అంచుకు తీసుకెళ్లాడు. గత రెండు మ్యాచ్‌లలో, శివమ్ సింగ్ 30, నాటౌట్‌గా 82 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను మొత్తం 12 సిక్సర్లు, 17 ఫోర్లు కొట్టాడు. అతను రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సీకెమ్ మధురై పాంథర్స్‌పై, అతను అత్యధికంగా ఆరు సిక్సర్లు కొట్టాడు.

మ్యాచ్ పరిస్థితి..

ఈ మ్యాచ్‌లో సాలెం స్పార్టన్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టమైన ప్రదర్శన కనబరిచింది. శివం సింగ్ విధ్వంసకర బ్యాటింగ్, అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు, ఇతర ఆటగాళ్లు కూడా తమ వంతు కృషి చేశారు. ఈ విజయం సాలెం స్పార్టన్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన సీకెమ్ మధురై పాంథర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులు చేసింది. మధురై జట్టు తరపున అతిక్ ఉర్ రెహ్మాన్ అత్యధికంగా 50 పరుగులు చేశాడు. అంతేకాకుండా, బాలచంద్ర అనిరుధ్ 24 బంతుల్లో 31 పరుగులు చేశాడు. దిండిగల్ డ్రాగన్ జట్టు తరపున గణేషన్ పెరియస్వామి, డిటి చంద్రశేఖర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆర్ అశ్విన్, సందీప్ వారియర్ చెరో వికెట్ తీసుకున్నారు. దిండిగల్ జట్టు 12.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేరుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..