AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar: అది నేను కాదు.. డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన క్రికెట్ దిగ్గజం సచిన్.. ఏమన్నారంటే..

Sachin Tendulkar deepfake video: డీప్‌ ఫేక్‌ వీడియోలకు సామాన్యులే కాదు, ప్రముఖులు కూడా బాధితులు అవుతున్నారు. ఈ బాధితుల జాబితాలో లెజెండరీ క్రికెటర్ సచిన్‌ టెందూల్కర్‌ కూడా చేరారు. సచిన్‌, ఒక వీడియో గేమ్‌ను ప్రమోట్‌ చేసినట్లు వీడియో వైరల్‌ అవుతోంది. దీనిని సచిన్ తెందూల్కర్‌ ఖండించారు. వీడియోలో ఉన్నది తాను కాదన్నారు.

Sachin Tendulkar: అది నేను కాదు.. డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన క్రికెట్ దిగ్గజం సచిన్.. ఏమన్నారంటే..
Sachin Tendulkar
Shaik Madar Saheb
|

Updated on: Jan 15, 2024 | 3:36 PM

Share

Sachin Tendulkar deepfake video: డీప్‌ ఫేక్‌ వీడియోలకు సామాన్యులే కాదు, ప్రముఖులు కూడా బాధితులు అవుతున్నారు. ఈ బాధితుల జాబితాలో లెజెండరీ క్రికెటర్ సచిన్‌ టెందూల్కర్‌ కూడా చేరారు. సచిన్‌, ఒక వీడియో గేమ్‌ను ప్రమోట్‌ చేసినట్లు వీడియో వైరల్‌ అవుతోంది. దీనిని సచిన్ తెందూల్కర్‌ ఖండించారు. వీడియోలో ఉన్నది తాను కాదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీడియోలో తాను కాదని ట్వీట్‌ చేసిన సచిన్‌.. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిందంటే.. సచిన్ టెండూల్కర్ తెందూల్కర్.. మొబైల్ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లు.. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా వీడియోను క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ఇటీవల బాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో సచిన్ మాట్లాడుతూ.. సదరు గేమ్ యాప్ ను తన కూతురు కూడా ఉపయోగిస్తోందని.. అందులోని గేమ్స్ ఆడుతూ రోజుకు లక్షా 80 వేల దాకా సంపాదిస్తోందని చెప్పాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానని, ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం ఇంత సులభంగా మారిపోయిందా అని అనుకున్నానంటూ వివరించాడు.. అయితే, క్రికెట్ దిగ్గజం సచిన్ ప్రొమోట్ చేస్తున్నట్లు కనిపించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే, లక్షలాదిమంది చూసిన ఈ వీడియో విషయం.. సచిన్ టెండూల్కర్ దృష్టికి చేరింది. అలాంటి యాడ్ తాను ఎన్నడూ చేయలేదని పేర్కొన్న సచిన్.. దీనిని డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేశారంటూ చెప్పారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి వీడియోలు తీయడం సరికాదంటూ సీరియస్ అయ్యారు. ఈ తరహా వీడియోలు ఎక్కడ చూసినా వెంటనే రిపోర్ట్ కొట్టాలంటూ తన అభిమానులకు సచిన్ పిలుపునిచ్చారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. సచిన్ కూతురు సారా తెందూల్కర్ కూడా కొద్ది రోజుల క్రితం డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ఉన్నట్టు ఆ వీడియోలో ఉంది. వాస్తవానికి సారా తన సోదరుడు అర్జున్‌తో ఉన్నప్పుడు తీసిన వీడియోను మార్ఫింగ్ చేశారు. అంతకుముందు.. పలువురు హీరోయిన్లు కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?