8 సిక్సర్లతో ఊచకోత.. 35 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన సన్‌రైజర్స్ ఆటగాడు.. ఎవరంటే?
ఒకప్పుడు టెస్టులు, వన్డేలు రాజ్యమేలాయి.. అయితే ఇప్పుడంతా టీ20, ఫ్రాంచైజీ క్రికెట్‌దే హవా. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్లు, డొమెస్టిక్ ప్లేయర్స్ సైతం వీటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. టెస్టులకు, వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పేసి.. వీటినే తమ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.
ఒకప్పుడు టెస్టులు, వన్డేలు రాజ్యమేలాయి.. అయితే ఇప్పుడంతా టీ20, ఫ్రాంచైజీ క్రికెట్‌దే హవా. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్లు, డొమెస్టిక్ ప్లేయర్స్ సైతం వీటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. టెస్టులకు, వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పేసి.. వీటినే తమ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసన్ రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి.. వైట్ బాల్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మొదలైన ఎస్‌ఏ20 టోర్నమెంట్‌లో క్లాసన్ దుమ్ముదులిపాడు. 35 బంతుల్లో విధ్వంసం సృష్టించడమే కాదు.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. కానీ.! చివరికి తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.
ఎస్‌ఏ20 టోర్నీలో గురువారం ముంబై కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న డర్బన్.. ప్రత్యర్ధి జట్టు ముంబై కేప్‌టౌన్‌ను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కేప్‌టౌన్ జట్టు వికెట్ కీపర్ రికెల్టన్ 51 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. డుస్సెన్(24), లివింగ్‌స్టన్(25) రాణించగా.. ఆఖర్లో పొలార్డ్(31) వేగంగా పరుగులు చేయడంతో కేప్‌టౌన్ జట్టు భారీ స్కోర్ సాధించింది.
ఇక 208 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన డర్బన్ జట్టుకు.. ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డికాక్(5) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాగే ముల్దర్(5), కీమో పాల్(15) వికెట్లను కూడా వెంటవెంటనే కోల్పోయింది. మిడిలార్డర్‌లో దిగిన క్లాసన్ 35 బంతుల్లో చిన్న సైజ్ విధ్వంసం సృష్టించాడు. 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీతో తన జట్టును విజయాన్ని చేరువ చేయడానికి ప్రయత్నించినా.. ఆఖర్లు వరుసగా వికెట్లు పడిపోవటంతో 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కూడా డర్బన్ విజయానికి అడ్డు తగిలింది. దీంతో క్లాసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృధా అయింది.