RR vs PBKS IPL 2021Highlights: పోరాడి ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌.. సంజు సామ్సన్‌ సెంచరీ వృథా.. పంజాబ్‌ గ్రాండ్‌ విక్టరీ.. ‌

Narender Vaitla

| Edited By: Subhash Goud

Updated on: Apr 13, 2021 | 12:10 AM

RR vs PBKS Live Score in Telugu: ఐపీఎల్‌ 2021లో మరో ఆసక్తికర పోరు మొదలైంది. దిగ్గజ టీమ్‌లు రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే టాస్‌ గెలిచిన .... టీమ్‌ కెప్టెన్‌ .... ఎంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో..

RR vs PBKS IPL 2021Highlights: పోరాడి ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌.. సంజు సామ్సన్‌ సెంచరీ వృథా.. పంజాబ్‌ గ్రాండ్‌ విక్టరీ.. ‌
Rr Vs Pbks Ipl Match

RR vs PBKS Highlights in Telugu: IPL 2021: ఐపీఎల్‌ 14లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో కనబర్చిన పంజాబ్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది. 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 7 వికెట్లకు 217 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌(119: 63 బంతుల్లో 12 ఫోర్లు, 7సిక్సర్లు) భారీ శతకం వృథా అయింది. జట్టును గెలిపించేందుకు ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు.

అయతే నరాలు తెగే ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ కొనసాగింది. చివరి బంతి వరకు విజేత ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇలానే సాగింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 200కు పైగా పరుగులతో భారీ స్కోర్‌ నెలకొల్పినా రాజస్థాన్‌ చివరి బతి వరకు పోరాడింది. ప్రధానంగా ఆ జట్టు కెప్టెన్‌ సంజు శాంసన్‌ (119: 63 బంతుల్లో.. 12 ఫోర్లు, 7 సిక్సులు) ఒంటరి పోరాటం చేసిన తీరు అభిమానులను కట్టిపడేసింది. శాంసన్ సెంచరీతో అదరగొట్టినా మిగతా బ్యాట్స్‌మన్ రాణించకపోవడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

తుది జట్లు:

పంజాబ్ కింగ్స్:

కేఎల్ రాహుల్(కెప్టెన్​, వికెట్​ కీపర్​), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్​దీప్​ సింగ్.

రాజస్థాన్ రాయల్స్:

 జోస్ బట్లర్ (వికెట్​ కీపర్​), మనన్ వోహ్రా, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, శివం దుబే, రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Apr 2021 11:46 PM (IST)

    చివరి వరకు ఉత్కంఠగా కొనసాగిన మ్యాచ్‌.. పంజాబ్‌ గ్రాండ్‌ విక్టరీ..

    పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్యలో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్‌ పెట్టిన 221 పరుగులను రాజస్థాన్‌ రాయల్స్‌ చేధించలేక పోయింది. చివరు వరకు పోరాడిన రాజస్థాన్‌ కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

  • 12 Apr 2021 11:34 PM (IST)

    ఉత్కంఠంగా మారుతోన్న మ్యాచ్‌.. ఆరు బంతుల్లో…

    మ్యాచ్‌ చివరికి చేరే సమయానికి ఉత్కంఠంగా మారుతోంది. రాజస్థౄన్‌ గెలవాలంటే ఆరు బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. మరి కెప్టెన్‌ సంజు తన జట్టును విజయానికి చేరువచేస్తాడో లేదో చూడాలి.

  • 12 Apr 2021 11:31 PM (IST)

    కీలక సమయంలో వికెట్‌ తీసిన రిలే మెరెడిత్‌..

    మ్యాచ్‌ రాజస్థాన్‌ చేతుల్లోకి వెళ్తోందనుకుంటోన్న సమయంలో బంతిని తీసుకున్న రిలే మెరెడిత్‌ 18వ ఓవర్‌ తొలి బంతికే వికెట్‌ తీశాడు. దీంతో రాజస్థాన్‌ మరోసారి కష్టాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం రాజస్థాన్‌ 10 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉంది.

  • 12 Apr 2021 11:25 PM (IST)

    సెంచరీ పూర్తి చేసుకున్న సంజు సామ్సన్‌… రాజస్థాన్‌ను విజయతీరాలకు చేరుస్తాడా..?

    జట్టును విజయతీరాలకు చేర్చే క్రమంలో అద్భుత బ్యాటింగ్‌ చేస్తోన్న సంజు సామ్సన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 52 బంతుల్లో 102 పరుగులు సాధించి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్‌ విజయం కోసం 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది.

  • 12 Apr 2021 11:22 PM (IST)

    దంచి కొడుతోన్న సంజు సామ్సన్‌… మ్యాచ్‌ గెలిపించేనా.?

    పంజాబ్‌ భారీ స్కోర్‌ను చేధించే క్రమంలో తడబడిన రాజస్థాన్‌ జట్టును ఆదుకునే పనిలో పడ్డ ఆ జట్టు కెప్టెన్‌ ఆచితూచి ఆడుతూ ఛాన్స్‌ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు. కేవలం 52 బంతుల్లో 92 పరుగులు సాధించాడు. మరి కెప్టెన్‌ తన టీమ్‌ను విజయ తీరాలకు చేరుస్తాడో చూడాలి.

  • 12 Apr 2021 11:18 PM (IST)

    కీలక వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌…

    సంజు సామ్సన్‌, రియాన్‌ పరాగ్‌ భాగస్వామ్యంలో మ్యాచ్‌ రాజస్థాన్‌ చేతుల్లోకి వస్తుందని అనుకుంటోన్న సమయంలోనే పరాగ్‌ వికెట్‌ రూపంలో భారీ దెబ్బ తగిలింది. షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చిన పరాగ్‌ వెనుదిరిగాడు. రాజస్థాన్‌ గెలవాలంటే 20 బంతుల్లో 45 పరుగులు చేయాల్సి ఉంది.

  • 12 Apr 2021 11:13 PM (IST)

    దూకుడు మీదున్న రియాన్‌ పరాగ్‌.. 50 పరుగులు పూర్తి చేసుకున్న భాగస్వామ్యం..

    కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతోన్న సంజు సామ్సన్‌కు తోడుగా నిలిచాడు రియాన్‌ పరాగ్‌. అద్భుతంగా ఆడుతూ బంతును బౌండరీలకు తరలిస్తున్నాడు. 16వ ఓవర్‌లో వరసుగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో జట్టు స్కోరు స్పీడ్‌తో పరిగెత్తింది. ప్రస్తుతం రాజస్థాన్‌ జట్టు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 174 వద్ద కొనసాగుతోంది. రాజస్థాన్‌ 24 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉంది.

  • 12 Apr 2021 11:05 PM (IST)

    నాలుగు వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతోన్న సంజు..

    13 ఓవర్లకు రాజస్థాన్‌ 128/4: అర్ష్‌దీప్‌ వేసిన ఈ ఓవర్‌లో శివమ్‌దూబె(23) ఔటయ్యాడు. హుడా చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. దాంతో రాజస్థాన్‌ 123 పరుగుల వద్ద నాలుగో వికట్‌ కోల్పోయింది. రాజస్థాన్‌ గెలవడానికి 31 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉంది.

  • 12 Apr 2021 10:51 PM (IST)

    వంద మార్కు దాటిన రాజస్థాన్‌.. కెప్టెన్‌ హాఫ్‌ సెంచరీ..

    పంజాబ్‌ ఉంచిన భారీ స్కోర్‌ను సాధించే దిశగా మ్యాచ్‌ మొదలు పెట్టిన రాజస్థాన్‌ కష్టాలకు ఎదురీరుతోంది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్‌ ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంజు తన హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్‌ స్కోర్‌ 12 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 117 వద్ద కొనసాగుతోంది. రాజస్థాన్‌ జట్టు విజయం కోసం 48 బంతుల్లో 105 పరుగులు చేయాల్సి ఉంది.

  • 12 Apr 2021 10:29 PM (IST)

    అంతలోనే మరో దెబ్బ.. బట్లర్‌ అవుట్‌..

    జట్టు స్కోరును పెంచే క్రమంలో బట్లర్‌, సంజు సామ్సన్‌లు ఆచితూచి ఆడుతున్నారని అనుకుంటున్న సమయంలో బట్లర్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో రాజస్థాన్‌కు మంచి పాట్నర్‌షిప్‌ బ్రేక్‌ అయ్యింది. 7.3వ బంతికి రిచర్డ్‌సన్‌ వేసిన బంతికి బట్లర్‌ బౌల్డ్‌ అయ్యాడు.

  • 12 Apr 2021 10:14 PM (IST)

     రాజస్థాన్‌కు ఈ భాగస్వామ్యం చాలా కీలకం..

    రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ మ్యాచ్ గెలవాలంటే బట్లర్‌, సంజు సామ్సన్‌ల భాగస్వామ్యం చాలా కీలకంగా మారనుంది. వీరిద్దరి సమిష్టిగా రాణిస్తేనే పంజాబ్‌ ఇచ్చిన భారీ స్కోరును రాజస్థాన్‌ అధిగమించగలదు. చూడాలి మరి వీరిద్దరు ఏ మేర జట్టును ముందుకు తీసుకెళ్తారో.

  • 12 Apr 2021 10:10 PM (IST)

    జోరు మీదున్న బట్లర్‌.. వరుసగా నాలుగు ఫోర్లు..

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ రాజస్థాన్‌ జట్టును బట్లర్‌ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. నాలుగో ఓవర్‌లో ఏకంగా నాలుగు బంతులను వరుసగా బౌండరీలకు తరలించి జట్టు స్కోర్‌ పెంచుతున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు సాధించింది.

  • 12 Apr 2021 10:06 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌.. పెవిలియన్‌ బాట పట్టిన మనన్ వోహ్రా..

    రాజస్థాన్‌ రాయల్స్‌ వరుసగా వికెట్లు కోల్పోతోంది. తొలి ఓవర్లోనే మొదటి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌.. మరో వికెట్‌ను నష్టపోయింది. అర్ష్‌ దీప్‌ బౌలింగ్‌లో మనన్ వోహ్రా పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 12 Apr 2021 09:54 PM (IST)

    ఆదిలోనే రాజస్థాన్‌కు దెబ్బ… తొలి ఓవర్‌లోనే..

    భారీ లక్ష్యంతో దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే మహమ్మద్‌ షమీ వికెట్‌ను తీసుకున్నాడు. మూడో బంతికే బెన్‌ స్టోక్స్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. షమీ వేసిన బంతిలో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 12 Apr 2021 09:28 PM (IST)

    రాహుల్‌ అవుట్‌.. తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీ మిస్‌..

    తన అద్భుత బ్యాటింగ్‌తో పంజాబ్‌ స్కోరు ఓ రేంజ్‌లో పరుగులెత్తించిన కే ఎల్‌ రాహుల్‌ తొమ్మిది పరుగుల దూరంలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 91 పరుగులు సాధించిన రాహుల్‌ 91వ పరుగుల వద్ద చేతన్‌ బౌలింగ్‌లో రాహుల్ తెవాతియాకు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

  • 12 Apr 2021 09:13 PM (IST)

    ఆగిపోయిన దీపక్‌ పరుగుల వేట.. 200కు చేరిన పంజాబ్‌ స్కోర్‌..

    కేవలం 28 బంతుల్లో 64 పరుగులు సాధించి పంజాబ్‌ జట్టు స్కోరును పరుగులు పెట్టించిన దీపక్‌ వెనుదిరిగాడు. 17.3వ బంతికి క్రిస్‌ మోరిస్ బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి దీపక్‌ వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే పంజాబ్‌ జట్టు స్కోరు 200 మార్కు దాటింది.

  • 12 Apr 2021 09:03 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న దీపక్‌ హుడా.. కేవలం 20 బంతుల్లో..

    జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డ దీపక్‌ హుడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 20 బంతుల్లోనే 6 సిక్సర్లు, ఒక ఫోర్‌తో హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌ చేశాడు. ప్రస్తుతం దీపక్‌ స్కోర్ 23 బంతులకు 52 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 12 Apr 2021 08:58 PM (IST)

    వాంఖడేలో పరుగుల తుఫాను..

    వాంఖడేలో పరుగుల తుఫాను చెలరేగుతోంది. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడుతుండడంతో పరుగుల వరద పారుతోంది. ఇదే విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం వాంఖడేలో తుఫాను లేస్తోందంటూ.. ఓ జిప్‌ ఫైల్‌ను షేర్‌ చేసింది.

  • 12 Apr 2021 08:53 PM (IST)

    150 పరుగుల మార్క్‌ను దాటిన పంజాబ్‌.. భారీగా పెరిగిన రన్‌రేట్‌..

    దీపక్‌ హుడా, రాహుల్‌ ఇద్దరు కలిసి పంజాబ్‌ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. ఇద్దరు ఒకరి మించి మరొకరు భారీ షాట్లతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే 150 పరుగుల మార్కును దాటేసింది. ప్రస్తుతం 15 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయిన పంజాబ్‌ 161 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో దీపక్‌ 41 పరుగులు.. రాహుల్‌ 63 పరుగులతో కొనసాగుతున్నారు. పంజాబ్‌ 10 రన్‌రేట్‌తో కొనసాగుతోంది.

  • 12 Apr 2021 08:52 PM (IST)

    దీపక్‌ హుడా కూడా తగ్గట్లేదుగా..

    కెప్టెన్‌ రాహుల్‌ జోరుకు కొత్తగా క్రీజులోకి వచ్చిన దీపక్‌ కూడా తోడవుతున్నాడు. 12 ఓవర్‌లో రెండు సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో దీపక్‌ కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు.

  • 12 Apr 2021 08:39 PM (IST)

    భారీ సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌..

    పంజాబ్‌ జట్టు స్కోరును పరుగులెత్తించే పనిలో పడ్డ కెప్టెన్‌ రాహుల్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 30 పరుగుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 12.2 బంతిలో సిక్సర్‌తో తన హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌ చేశాడు.

  • 12 Apr 2021 08:33 PM (IST)

    వంద మార్కును దాటిన పంజాబ్‌… రెచ్చిపోతున్న రాహుల్‌..

    క్రిస్‌ గేల్‌ వికెట్‌ కోల్పోయిన కూడా రాహుల్‌ బ్యాటింగ్‌ జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు. వరుసగా ఫోర్లు, సిక్సులు బాదుతూ.. జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పంజాబ్‌ జట్టు స్కోర్‌ వంద మార్కును దాటింది. 11 ఓవర్లకు పంజాబ్‌ జట్టు రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌ 27 బంతుల్లో 44 పరుగులు, దీపక్ హుడా 1 పరుగుతో కొనసాగుతున్నారు.

  • 12 Apr 2021 08:30 PM (IST)

    పంజాబ్‌కు షాక్‌.. మంచి పాట్నర్‌ షిప్‌ను బ్రేక్‌ చేసిన రియాన్ పరాగ్..

    కేవలం 28 బంతుల్లో 40 పరుగులు సాధించిన పంజాబ్‌ జట్టు స్కోర్‌ను పరుగులెత్తించిన క్రిస్‌గేల్‌ అవుట్‌ అయ్యాడు. రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి గేల్‌ వెనుదిరిగాడు. ఈ వికెట్‌ పంజాబ్‌ స్కోర్‌ వేగంపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు.

  • 12 Apr 2021 08:23 PM (IST)

    7వ ఓవర్‌ తర్వాత దూకుడు పెంచిన పంజాబ్‌..

    మ్యాచ్‌ మొదలైన ప్రారంభంలో ఆచితూచి ఆడిన పంజాబ్‌ జట్టు 7 ఓవర్‌ తర్వాత దూకుడు పెంచింది. గేల్‌ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ రాహుల్‌ (20 బంతుల్లో 30)లు.. ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నారు.

  • 12 Apr 2021 08:16 PM (IST)

    పంజాబ్‌కు భారీ ఓవర్‌.. 12 పరుగులు..

    రాహుల్‌, గేల్‌ మంచి ఆటతీరును కనబరుస్తున్నారు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లతో బంతిని బౌండరీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడో ఓవర్‌లో 12 పరుగులు సాధించారు.

  • 12 Apr 2021 08:10 PM (IST)

    50 పరుగుల మార్కును దాటేసిన పంజాబ్‌..

    రెండో ఓవర్‌లోనే తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌ జట్టుకు క్రిస్‌ గేల్‌ రూపంలో మంచి ప్లేయర్‌ క్రీజులోకి వచ్చాడు. గేల్‌, రాహుల్‌ ఇద్దరు దూకుడుగా ఆడుతున్నారు. స్టేడియంలో ఫోర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌ 50 పరుగుల మార్కును దాటేసింది. ప్రస్తుతం 6 ఓవర్లు పూర్తయ్యేసరికి క్రీజులో గేల్‌ (21), రాహుల్‌ (20) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 12 Apr 2021 08:06 PM (IST)

    లాంగ్‌ ఆన్‌లోకి దూసుకెళ్లిన క్రిస్ గేల్‌ షాట్‌..

    మయాంక్‌ అగర్వాల్‌ అవుట్‌ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్‌ గేల్‌ తన బ్యాటుకు పనిచెప్తున్నాడు. మోరిస్‌ వేసిన 5.5 బంతిని లాంగ్‌ ఆన్‌లో నాలుగు పరుగులు సాధించాడు. మరి ఈ మ్యాచ్‌లో గేల్‌ ఎలాంటి ఆటతీరును కనబరుస్తాడో చూడాలి.

  • 12 Apr 2021 07:50 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన్‌ పంజాబ్‌.. వెనుదిరిగిన అగర్వాల్‌..

    పంజాబ్‌ కింగ్స్‌ 11 తొలి వికెట్‌ను కోల్పోయింది. 14 పరుగులతో పంజాబ్‌కు మంచి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మయాంక్ అగర్వాల్ పెవిలియన్‌ బాట పట్టాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ సంజు సామ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్‌ 1 వికెట్‌ నష్టానికి 26 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 12 Apr 2021 07:40 PM (IST)

    ఈసారి అదే రిపీట్‌ కానుందా..? లేదా…

    గత సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌నే విజయం వరించింది. 2020 సీజన్‌లో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 224 పరుగుల టార్గెట్‌ను ఛేదించి మరీ పంజాబ్‌పై గెలుపొందింది. మరి ఈసారైనా పంజాబ్‌ ఆ సంప్రదాయానికి బ్రేక్‌ వేస్తుందా. రాజస్థాన్‌ విజయపరంపరను అడ్డుకుంటుందో చూడాలి.

  • 12 Apr 2021 07:34 PM (IST)

    టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌.. బౌలింగ్‌కు మొగ్గు..

    రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచింది. దీంతో కెప్టెన్‌ సంజు సామ్సన్‌ మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం పంజాబ్‌ బ్యాటింగ్‌ మొదలు పెట్టింది. మయానక్‌ అగర్వాల్‌, కెఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగారు.

  • 12 Apr 2021 07:12 PM (IST)

    రెండు టీమ్‌లు ఎలా ఉన్నాయంటే..

    ఐపీఎల్‌ 2021 సీజన్‌లో భాగంగా జరుగుతోన్న నాలుగో మ్యాచ్‌లో ఇద్దరు ‘వికెట్‌ కీపర్‌ కెప్టెన్లు’ తలపడనున్నారు. ఈ ఇరు జట్టు ఇప్పటి వరకు 21 సార్లు తలపడగా 12 సార్లు రాజస్థాన్‌ రాయల్స్‌ గెలుపొందింది. 9 సార్లు పంజాబ్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక కెప్టెన్ల విషయానికొస్తే కూడా… సంజూ సామ్సన్‌ 107 ఐపీఎల్‌ క్యాప్స్‌ అందుకోగా, కేఎల్‌ రాహుల్‌ 81 సార్లు క్యాప్స్‌ అందుకున్నాడు. దీంతో మ్యాచ్‌ కాస్త రాజస్థాన్‌ జట్టుకే అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది ఐపీఎల్‌ ఎప్పడైనా అద్భుతం జరగొచ్చు. కదూ…

  • 12 Apr 2021 07:05 PM (IST)

    ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేస్తున్న ఆటగాళ్లు..

    నేడు జరగనున్న మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదే… ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి మొత్తం 5 మంది కొత్త ఆటగాళ్లు ఆరంగేట్రం చేయనున్నారు. పంజాబ్‌ నుంచి భారత్‌ యువ బ్యాట్స్‌మెన్‌ మాన్ షారూఖ్ ఖాన్, ఇద్దరు ఆస్ట్రేలియా పేసర్లు రిలీ మెరెడిత్, రిచర్డ్స్‌ ఆరంగ్రేటం చేయనున్నారు. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి బంగ్లాదేశ్ మీడియం పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్, భారత ఆల్ రౌండర్ శివం దుబే ఆరంగేట్రం చేస్తున్నారు.

Published On - Apr 12,2021 11:46 PM

Follow us