ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తొలి విజయం అందుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల్ కోల్పోయి 158 పరుగులు చేసింది. ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ముంబై ఇండియన్స్ తొలి విజయం సాదించింది.
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ తిలక్ వర్మ ఔటయ్యాడు.
ముంబై మూడో వికెట్ కోల్పోయింది. సూర్యాకుమార్ యాదవ్ ఔటయ్యాడు.
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఔటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి1 58 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ క్యాచ్ ఔటయ్యాడు.
రాజస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది.
రాజస్థాన్ రాయల్స్ కీలక వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన జోస్ బట్లర్ ఔటయ్యాడు.
రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది.
రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు కెప్టెన్ సంజు శాంసన్ క్యాచ్ ఔటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. పడిక్కల్ క్యాచ్ ఔటయ్యాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.