IPL 2025 Final: తొలి ట్రోఫీని ముద్దాడిన బెంగళూరు.. పంజాబ్‌పై ఘన విజయం.. 17 ఏళ్ల కోహ్లీ కల నెలవేరిన వేళ

Royal Challengers Bengaluru vs Punjab Kings, IPL 2025 Final: ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ జట్టు ఎనిమిదో ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి ముందు, చెన్నై సూపర్ కింగ్స్ (5 సార్లు), ముంబై ఇండియన్స్ (5 సార్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (3 సార్లు), రాజస్థాన్ రాయల్స్ (1), డెక్కన్ ఛార్జర్స్ (1), సన్‌రైజర్స్ హైదరాబాద్ (1), గుజరాత్ జెయింట్స్ (1) ఛాంపియన్లుగా నిలిచాయి.

IPL 2025 Final: తొలి ట్రోఫీని ముద్దాడిన బెంగళూరు.. పంజాబ్‌పై ఘన విజయం.. 17 ఏళ్ల కోహ్లీ కల నెలవేరిన వేళ
Rcb Ipl 2025 Winner

Updated on: Jun 03, 2025 | 11:46 PM

Royal Challengers Bengaluru vs Punjab Kings, IPL 2025 Final: ఎట్టకేలకు కోహ్లీ కల నెరవేరింది. 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి, తొలి ట్రోఫీని ముద్దాడింది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి టైటిల్‌ను గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)ను 6 పరుగుల తేడాతో ఓడించింది. దీనితో, IPL 18వ సీజన్‌లో 8వ ఛాంపియన్‌గా నిలిచింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పీబీకేఎస్ 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జితేష్ వేగంగా బ్యాటింగ్ చేసి 240 స్ట్రైక్ రేట్‌తో 10 బంతుల్లో 24 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 17 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామిసన్ 3-3 వికెట్లు పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ జట్టు ఎనిమిదో ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి ముందు, చెన్నై సూపర్ కింగ్స్ (5 సార్లు), ముంబై ఇండియన్స్ (5 సార్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (3 సార్లు), రాజస్థాన్ రాయల్స్ (1 సారి), డెక్కన్ ఛార్జర్స్ (1 సారి), సన్‌రైజర్స్ హైదరాబాద్ (1 సారి), గుజరాత్ జెయింట్స్ (1 సారి) ఛాంపియన్లుగా నిలిచాయి.

ఇరు జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..