భారత క్రికెట్ చరిత్రతో పాటు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనూ చిరకాలం నిలిచిపోయే టాప్ ప్లేయర్స్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇంకా చెప్పుకోవాలంటే ప్రస్తుత క్రికెట్‌లో అతడో అత్యుత్తమ బ్యాటర్.. కొండంత భారీ లక్ష్యాన్నైనా అవలీలలగా చేధించే రన్ మిషన్.. ఫీల్డింగ్‌లో చిరుత.. ఫిట్‌నెస్‌లో టాపర్. క్రమశిక్షణ, పట్టుదల, ఫిట్నెస్, దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్.. అతడిని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టాయి. ఒక క్రికెట్ ప్లేయర్‌గా ఎన్నో ప్రపంచ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డులు లిఖించిన కోహ్లీ.. అనేక సందర్భాలలో ‘ముందు దేశం తర్వాతే నేను’ అని చాటిచెప్పాడు. ఈ విషయం క్రికెట్ అభిమానులకే కాక సగటు భారతీయుడికి దాదాపుగా తెలిసిన విషయమే. అయితే తాజాగా మరోసారి ఇదే విషయాన్ని తెలియజేశాడు కింగ్ కోహ్లీ. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో జరిగిన ఓ సంఘటనే కోహ్లీ దేశభక్తికి ప్రత్యేక నిదర్శనం. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు కొద్ది సమయం కోహ్లీ స్లిప్‌లో ఫీల్డింగ్ చేశాడు. అప్పుడు స్టేడియంలో ఉన్న కొంత మంది క్రికెట్ అభిమానులు ‘ఆర్సీబీ, ఆర్సీబీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. అంతేనా ఆ స్టేడియంలో అరిచి అరిచి గోల కూడా చేశారు.
అయితే ఆ నినాదాలను విన్న విరాట్.. దేశం పట్ల తనకున్న ప్రేమను చూపించాడు. తాను ధిరించిన జెర్సీపై ఉన్న భారత్ లోగోను చూపిస్తూ ‘ఇండియా ఇండియా’ అంటూ అనాలని సూచించాడు. దీంతో అభిమానులు వెంటనే ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. అయినా కోహ్లీ.. మళ్లీ ఆ సౌండ్ చాలలేదని.. ఇంకా గట్టిగా అనాలని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ‘ఇండియా ఇండియా’ అంటూ ఢిల్లీ అంతా దద్దరిల్లేలా అరిచి రచ్చ రచ్చ చేశారు. అంతేకాక అలా కేకలు వేస్తూ కోహ్లీని ఎంకరేజ్ చేశారు.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..
Crowd was chanting ‘RCB, RCB’ – Virat Kohli told to stop it and chant ‘India, India’. pic.twitter.com/kMd53wbYRU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023
కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘దటీజ్ కోహ్లీ.. అతనికి దేశమే ముఖ్యం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ వేదికగా జరిగిన ఆ రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా టీమిండియా ఇప్పుడు నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 2-0 తో ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు ఇరు జట్ల మధ్య మార్చి 1 నుంచి ఇండోర్‌లో ప్రారంభం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..