AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హే.. షెపీ నువ్వేనా? అదరగొట్టేశావ్‌గా.. మరి ఐపీఎల్‌లో ఏమైంది? RCB ప్లేయర్ మాస్ కంబ్యాక్

ఆర్సీబీ 2026లో ఐపీఎల్ ఛాంపియన్‌గా వరుసగా రెండోసారి నిలిచింది. ఈ సీజన్‌లో రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో విఫలమైనా, జట్టు గెలిచింది. అయితే, ఇటీవల షెపర్డ్ కేవలం 5 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి, 1.25 ఎకానమీతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో 11.92 ఎకానమీతో నిరాశపరిచిన షెపర్డ్ , ఈ ప్రదర్శనపై ఆర్సీబీ అభిమానులు ఆశ్చర్యపోతూ, వచ్చే సీజన్‌లో ఇదే ఊపు కొనసాగించాలని ఆశిస్తున్నారు.

హే.. షెపీ నువ్వేనా? అదరగొట్టేశావ్‌గా.. మరి ఐపీఎల్‌లో ఏమైంది? RCB ప్లేయర్ మాస్ కంబ్యాక్
Gold (11)
SN Pasha
|

Updated on: Jun 28, 2026 | 7:02 PM

Share

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా రెండో సార్లు కప్పు కొట్టి అదరగొట్టింది. 2024 సీజన్ ముగిసిన తర్వాత ఒక్క కప్పు కూడా లేని ఆర్సీబీ.. 2026 సీజన్ ముగిశాక ఏకంగా రెండు కప్పులున్న టీమ్‌గా అవతరించింది. అయితే 2025 సీజన్‌లో కప్పు గెలిచిన కోర్ టీమ్‌ను కొనసాగిస్తూ రెండో సారి కూడా ఛాంపియన్ అయింది. అయితే 2025లో అద్భుతంగా ఆడి, 2026లో ఆశించిన స్థాయిలో రాణించని ప్లేయర్ ఒకరు ఉన్నారు ఆర్సీబీలో. అతనే రొమారియో షెపర్డ్.

గత సీజన్‌లో ఒక్క ఇన్సింగ్స్‌‌తో అదరగొట్టిన రొమారియో.. ఈ సీజన్‌లో మాత్రం అంతగా రాణించలేదు. బౌలింగ్‌లో అయితే దారుణంగా విఫలం అయ్యాడు. 15 మ్యాచ్‌లు ఆడిన రొమారియో కేవలం 7 వికెట్లు తీసుకున్నాడు. పైగా అతని ఎకానమీ దారుణంగా ఉంది. 11.92 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. అయినా కూడా ఆర్సీబీ అతనిపై నమ్మకంతో బ్యాక్ చేసుకుంటూనే వచ్చింది. జట్టులోని మిగతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చాలా సందర్భాల్లో రొమారియో వైఫల్యం అంతగా జట్టుపై ప్రభావం చూపించలేదు.

అయితే అదే రొమారియో షెపర్డ్ తాజాగా అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేసి.. కేవలం 5 అంటే 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పైగా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అతను వేసిన నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు మెయిడెన్‌గా ఉండటం విశేషం. ఆర్సీబీ తరఫున 11.92 ఎకానమీతో బౌలింగ్ చేసిన రొమారియో.. ఈ మ్యాచ్‌లో కేవలం 1.25 రికార్డు ఎకానమీతో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ బౌలింగ్ చూసి.. ఆర్సీబీ ఫ్యాన్స్ హే.. షెపీ(షెపర్డ్) ఇది నువ్వేనా? అంటూ షాక్ అవుతున్నారు. ఇదే బౌలింగ్ ఐపీఎల్‌లో కూడా వేసి ఉంటే బాగుండేది కదా అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. సర్లే.. వచ్చే సీజన్‌లో ఇలాగే వేయి.. హ్యాట్రిక్ కప్పులు కొడదాం అంటూ మరికొందరు సోషల్ మీడియాలో షెపర్డ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..