ఆసీస్ మీడియా పోస్టర్‌లో రోహిత్‌కు బదులు కోహ్లీ.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌ గరం గరం..!

భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ను బ్రాడ్ కాస్ట్ చేయబోతున్న ఆస్ట్రేలియన్ టెలివిజన్ కంపెనీ ఫాక్స్ స్పోర్ట్స్ రోహిత్ శర్మ బదులు విరాట్ కోహ్లీ ఫోటోను ప్రచార పోస్టర్లలో ఉపయోగించడం.. రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమయింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఇటు కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. కోహ్లీనే టీమిండియా ముఖచిత్రం అని సంబరపడిపోతున్నారు.

ఆసీస్ మీడియా పోస్టర్‌లో రోహిత్‌కు బదులు కోహ్లీ.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌ గరం గరం..!
Virat Cummins

Edited By:

Updated on: Nov 10, 2024 | 4:32 PM

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ (యాషెస్), ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతుంటే ఆయా దేశాలే కాకుండా క్రికెట్ ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్ లపై దృష్టి సారిస్తాయి. ఆ తరువాత స్థానంలో ఇండియా-ఆస్ట్రేలియా ( బోర్డర్- గవాస్కర్) టెస్ట్ మ్యాచ్ లు కూడా అందరిని దృష్టిని ఆకర్షిస్తాయి. ఇండియా – అస్ట్రేలియా జట్లు మైదానంలో తలపడటమే కాదు మాటల యుద్దం కూడా చేస్తాయి. అయితే గత రెండు పర్యటనల్లో ఆస్ట్రేలియాకు సొంత గడ్డపై షాకిచ్చిన టీమిండియా ఈసారి మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దీనికి కారణం న్యూజిలాండ్ తో సిరీస్ వాట్ వైష్‌ కు గురవ్వడమే. అంతే కాదు జట్టు ఎంపికకు సంబంధించి ఇటు కోచ్ గంభీర్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఆస్ట్రేలియా మీడియా చేసిన ఓ పనితో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ఆస్ట్రేలియన్ టెలివిజన్ కంపెనీ ఫాక్స్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కు బదులు విరాట్ కోహ్లీ కనిపించాడు. ఈ టెస్ట్ సిరీస్ కోసం టెలివిజన్ ఉపయోగించే అన్ని ప్రకటనలలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తో పాటు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోలను మాత్రమే వాడాయి. విరాట్ కోహ్లీ లీడింగ్ ప్లేయర్ అయినప్పటికీ, ఆస్ట్రేలియా కెప్టెన్ ఫోటోను ఉపయోగించేటప్పుడు న్యాయంగా, మరోవైపు భారత కెప్టెన్ ఫోటోను ఉపయోగించాలి.

ఇప్పుడు ఇదే అంశంపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీకి చాలా మంది అభిమానులు ఉన్నందున, టీవీలో ప్రకటనలకు విరాట్ ఫోటోను ఉపయోగిస్తున్నాయి బ్రాడ్ కాస్ట్ ఛానల్స్. విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో చాలా మంది అభిమానులు ఉన్నట్లయితే, ఆస్ట్రేలియన్లు  కోహ్లీని ముఖ్యమైన ఆటగాడిగా భావిస్తే, అప్పుడు కోహ్లీ ఫోటోతో పాటు స్టీవ్ స్మిత్ ఫోటోలు పెట్టి ఉండవచ్చు. స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లిలు టెస్టు మ్యాచ్‌ల్లో ఒకరి రికార్డులను మరొకరు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఉండడంతో వీరిద్దరి ఫొటోలను అడ్వర్టైజ్‌మెంట్‌లో లింక్ చేసి ఉండొచ్చని అలా చేయకుండా రోహిత్ శర్మను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫాక్స్ స్పోర్ట్స్ పై రోహిత్ శర్మ అభిమానులు విమర్శలు గుప్పిస్తుంటే. ఇటు విరాట్ కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత జట్టుకు విరాట్ కోహ్లి ఎప్పటికి కెప్టెనే అని.. కోహ్లీనే టీమిండియా ఫేస్ అంటూ రోహిత్ శర్మ అభిమానులను సోషల్ మీడియాలో ఆటపట్టిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనిస్తే గత కొంత కాలంగా ఈ ఇద్దరు స్టార్స్ ఫేలవ ఫామ్ తో ఇబ్బందులు పడుతున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరు కనీసం పోరాటం చేయలేకపోతున్నారు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో వీరిద్దరూ 6 ఇన్నింగ్స్‌ల్లో వంద పరుగులు కూడా చేయలేకపోయారు.

ఫాక్స్ క్రికెటర్ పోస్టర్