RO-KHO: రో-కో @ 400.. రోహిత్, విరాట్ పేరిట చారిత్రాత్మక రికార్డ్.. అదేంటంటే?

Rohit Sharma - Virat Kohli: మైదానంలో వీరిద్దరి కెమిస్ట్రీ, టీమిండియాను అగ్రపథంలో నిలిపేందుకు వీరు చూపించే తపన కోట్లాది మంది వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో కూడా ఈ దిగ్గజ జంట వన్డేల్లో మరిన్ని అద్భుత రికార్డులు క్రియేట్ చేస్తూ, భారత క్రికెట్ కీర్తిపతాకాన్ని ఎగురవేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

RO-KHO: రో-కో @ 400.. రోహిత్, విరాట్ పేరిట చారిత్రాత్మక రికార్డ్.. అదేంటంటే?
Rohit Sharma Virat Kohli Records

Updated on: Jul 20, 2026 | 7:12 PM

Rohit Sharma – Virat Kohli: వీరిద్దరు కలిసి మైదానంలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టాల్సిందే. రికార్డులే కాదు, హిస్టరీనే మార్చాల్సిందే. అందులో ఒకరు హిట్‌మ్యాన్, మరొకరు కింగ్ కొహ్లీ. దశాబ్ద కాలానికి పైగా భారత క్రికెట్‌ను తమ భుజస్కంధాలపై మోస్తూ, కోట్లాది మంది అభిమానుల కలలను నిజం చేసిన ఈ దిగ్గజ జోడీ ఇప్పుడు మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఏ భారతీయ జోడీకి సాధ్యంకాని అరుదైన మైలురాయిని అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది.

లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనత..

క్రికెట్ మెక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి తమ 400వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడి సంచలనం సృష్టించారు. భారత క్రికెట్ చరిత్రలో అంతర్జాతీయ స్థాయిలో ఏ ఇద్దరు ఆటగాళ్ళు కూడా ఇన్ని మ్యాచ్‌లు కలిసి ఆడలేదు. గతంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ జోడీ 391 మ్యాచ్‌లలో కలిసి ఆడి నెలకొల్పిన రికార్డును వీరు ఇప్పటికే అధిగమించగా, ఇప్పుడు ఏకంగా 400 ల్యాండ్‌మార్క్‌ను తాకి అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.

పరుగుల సునామీ.. వందల సెంచరీలు..!

ఈ ఇద్దరు రికార్డుల వీరులు కలిసి భారత్‌కు సాధించిపెట్టిన విజయాలు లెక్కలేనన్ని. వీరిద్దరి భాగస్వామ్యం కేవలం మ్యాచ్‌ల సంఖ్యకే పరిమితం కాలేదు. మైదానంలో వీరు సాధించిన పరుగులు, బాదిన సెంచరీలు క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతాయి:

ఇవి కూడా చదవండి

కలిసి సాధించిన మొత్తం పరుగులు: 48,574

కలిసి నమోదు చేసిన సెంచరీలు: 135

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ గణాంకాలు: 562 మ్యాచ్‌లలో 28,285 పరుగులు (85 సెంచరీలు)

రోహిత్ శర్మ అంతర్జాతీయ గణాంకాలు: 514 మ్యాచ్‌లలో 20,289 పరుగులు (50 సెంచరీలు)

టీ20, టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న ఈ అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు, నేటికీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రపంచ వేదికపై ఏడో స్థానం..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు కలిసి ఆడిన ప్రపంచ జోడీలలో కుమార సంగక్కర – మహేల జయవర్ధనె (550 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా, రోహిత్-విరాట్ కాంబినేషన్ ఇప్పుడు ప్రపంచంలోనే 7వ స్థానానికి చేరుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఈ రోహిత్-కోహ్లీల చారిత్రాత్మక ఘనతపై స్పందిస్తూ, “టీమ్ ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 400 మ్యాచ్‌లు కలిసి ఆడిన తొలి భారతీయ జోడీగా నిలిచారు” అని సోషల్ మీడియాలో ప్రత్యేక అభినందనలు తెలిపింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us