IND vs AUS: ట్రోఫీ గెలిచినా.. కంగారులకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. మా బెస్ట్ కెప్టెన్ రోహిత్ అంటూ ప్రకటన..
ICC World Cup 2023: ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే అత్యుత్తమ జట్టులో ICC చోటు కల్పించింది. ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్‌వెల్ ఈ జట్టులో భాగమయ్యారు. పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వంటి ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఈ జట్టులో రచిన్ రవీంద్ర స్థానంలో న్యూజిలాండ్ నుంచి డారిల్ మిచెల్ చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్ డి కాక్ ఈ జట్టులోకి ఎంపికయ్యాడు.

ICC World Cup 2023: ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 43 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచినా.. చివరి, టైటిల్ మ్యాచ్‌లో బోల్తా కొట్టింది. అయితే, టీమ్ ఇండియా ప్రపంచ కప్‌లో ఓడిపోయినా.. రోహిత్ శర్మతో సహా ఆరుగురు ఆటగాళ్లను ఐసీసీ సత్కరించింది. ICC ప్రపంచ కప్ 2023 ఉత్తమ జట్టును ఎంపిక చేసింది. ఇందులో నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. ఈ టీమ్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికచేసింది.
ఐసీసీ అత్యుత్తమ ప్రపంచకప్ టీం కెప్టెన్‌గా హిట్‌మ్యాన్..
టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలవలేకపోయినా రోహిత్ శర్మ కెప్టెన్సీని అందరూ ఒప్పుకున్నారు. అతని నాయకత్వంలో భారత జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడింది. రౌండ్ రాబిన్, సెమీ ఫైనల్స్‌లో 9 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా ఏకపక్షంగా గెలిచింది. అయితే ఫైనల్‌లో రోహిత్ జట్టు ఓడిపోయింది. అయితే, టోర్నీలో అత్యుత్తమ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఐసీసీ ఎంపిక చేసింది. ODI ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ మొదటిసారిగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడని, మొదటిసారి అతను ఉత్తమ కెప్టెన్‌గా కూడా ఎన్నికయ్యాడు. రోహిత్‌కి చివరిసారిగా ఈ గౌరవం లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆటగాడికి 36 ఏళ్లు నిండాయి. 4 సంవత్సరాల తర్వాత 2027లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. కాబట్టి, ఆ ప్రపంచకప్‌లో రోహిత్‌కి కెప్టెన్సీ చేయడం కష్టంగా కనిపిస్తోంది.
ఐసీసీ అత్యుత్తమ ప్రపంచకప్ జట్టులో విరాట్ కూడా..
Best of the best 😍
Revealing the official CWC23 Team of the Tournament 👇https://t.co/WBmJnsdZ0e
— ICC (@ICC) November 20, 2023
రోహిత్ శర్మతో పాటు, విరాట్ కోహ్లీ కూడా ఐసీసీ ఉత్తమ ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. ఈ టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అతను అత్యధికంగా 765 పరుగులు చేశాడు. ఐసీసీ జట్టులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా ఎంపికయ్యారు. వీరితో పాటు బుమ్రా, షమీ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియా నుంచి కేవలం ఇద్దరు మాత్రమే..
ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే అత్యుత్తమ జట్టులో ICC చోటు కల్పించింది. ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్‌వెల్ ఈ జట్టులో భాగమయ్యారు. పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వంటి ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఈ జట్టులో రచిన్ రవీంద్ర స్థానంలో న్యూజిలాండ్ నుంచి డారిల్ మిచెల్ చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్ డి కాక్ ఈ జట్టులోకి ఎంపికయ్యాడు. ఐసీసీ జట్టులో శ్రీలంకకు చెందిన మధుశంకకు చోటు దక్కింది. పాకిస్థాన్ నుంచి ఏ ఆటగాడు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోస ఇక్కడ క్లిక్ చేయండి..




