Rohit Sharma: రోహిత్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. భారత టెస్ట్ జట్టు నుంచి హిట్‌మ్యాన్ ఔట్.. కెప్టెన్‌గా ఎవరంటే?
India vs England Test Series: భారత క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ తర్వాత భారత జట్టు 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటించనుంది. అయితే, ఈ టెస్ట్ నుంచే భారత జట్టులోనూ భారీ మార్పులు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

India vs England Test Series: ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారత వెటరన్ ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మను టెస్ట్ జట్టు నుంచి తొలగించనున్నట్లు సమాచారం. అలాగే, జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ ప్లేస్‌పై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ సిరీస్‌లో టీం ఇండియా 1-3 తేడాతో ఓడిపోయింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025–27 సైకిల్‌లోని మొదటి సిరీస్ నుంచి భారీ మార్పులతో భారత జట్టు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
భారత టెస్ట్ జట్టు నుంచి రోహిత్ శర్మ ఔట్..
రాబోయే ఇంగ్లాండ్ పర్యటన కోసం రోహిత్ శర్మను టెస్ట్ జట్టు నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా నియమించనున్నట్లు, కొత్త వైస్ కెప్టెన్‌ను కూడా నియమించే యోచనలో బీసీసీఐ ఉందని తెలుస్తోంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్..
2021లో ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ బాగా రాణించాడు. అక్కడ అతను 52.57 సగటుతో 368 పరుగులు చేశాడు. అయితే, ఫామ్‌తోపాటు నాయకత్వంలోనూ పలు లోపాలు కనిపిస్తున్నాయి. దీంతో మాజీలు రోహిత్ కెప్టెన్సీతోపాటు జట్టులో అతని స్థానంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.
సెప్టెంబర్ 2024 నుంచి రోహిత్ 15 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా ఆడిన చివరి ఆరు మ్యాచ్‌లలో ఐదు ఓటములను చవిచూసింది. వాటిలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో వైట్‌వాష్ ఎదుర్కోవడం అత్యంత దారుణం.
రోహిత్ లేని సమయంలో జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. పనిభారం నిర్వహణ, గాయాల కారణంగా బుమ్రా నాయకత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా భవిష్యత్తు కోసం బీసీసీఐ మరే ఇతర టెస్ట్ కెప్టెన్‌ను సిద్ధం చేయకపోవడం గమనార్హం.
ఐపీఎల్ 2025లోనూ రోహిత్ శర్మ..
ఈ బ్యాట్స్‌మన్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ముంబై ఇండియన్స్ (MI) తరపున ఆడుతున్నాడు. అయితే, అతని పేలవమైన ఫామ్ ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌కు ఆందోళనకరంగా మారింది. ఈ సీనియర్ బ్యాట్స్‌మన్ 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ అత్యధిక స్కోరు 26.
ఈ సీజన్‌లో అతను రెండు సింగిల్ డిజిట్ స్కోర్‌లను కూడా నమోదు చేశాడు. ఏప్రిల్ 20న ముంబైలో జరిగే 38వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు రోహిత్ సిద్ధమవుతున్నాడు. ఆ మ్యాచ్‌లోనూ విఫలమైతే ఫ్రాంచైజీ తమ మాజీ కెప్టెన్‌ను ప్లేయింగ్ 11లో ఆడిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 4 పాయింట్లను కలిగింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు పోటీలో ఉండాలంటే పాయింట్ల సంఖ్యను 14కు చేర్చాల్సి ఉంటుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




