Team India: బంగ్లాపై రోహిత్ ఇలా చేయాల్సిందే.. లేదంటే, టీమిండియాకు భారీ నష్టం.. అదేంటంటే?

India vs Bangladesh: ముఖ్యమైన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం గురించి మాజీలు కీలక సూచనలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దించింది. అయితే ఈ జట్టులో గాయపడిన ఆటగాళ్లు కొందరు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. వారు తరచుగా గాయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో వారి పనిభారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. ఏ ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

Team India: బంగ్లాపై రోహిత్ ఇలా చేయాల్సిందే.. లేదంటే, టీమిండియాకు భారీ నష్టం.. అదేంటంటే?
Team India Cwc 2023
Follow us
Venkata Chari

|

Updated on: Oct 18, 2023 | 12:56 PM

ICC World Cup 2023: ప్రపంచకప్‌ 2023 లో టీమిండియా ఆరంభం అద్భుతంగా ముందుకుసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన భారత్.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ను ఏకపక్షంగా దాడి చేసి ఓడించింది. ఇప్పుడు నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడాల్సి ఉంది. సహజంగానే ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాదే పైచేయి. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన తమకు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ నిర్ణయం టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చగలదు. వీటిని పట్టించుకోకపోతే, జట్టు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు. జట్టు విజయానికి లేదా వైఫల్యానికి దారితీసే ఈ నిర్ణయం ఏమిటి అని కాదా మీరు ఆలోచించేది? అదేంటో ఇప్పుడు చూద్దాం..

ముఖ్యమైన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం గురించి మాజీలు కీలక సూచనలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దించింది. అయితే ఈ జట్టులో గాయపడిన ఆటగాళ్లు కొందరు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. వారు తరచుగా గాయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో వారి పనిభారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. ఏ ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి అవసరం..

ఇందులో జస్ప్రీత్ బుమ్రా పేరు మొదటగా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ స్టార్ పేసర్ గాయాలతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. బుమ్రా చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. పెద్ద విషయం ఏమిటంటే అతను తిరిగి వచ్చినప్పటి నుంచి అద్భుత ప్రదర్శనతో దూసుకపోతున్నాడు. బుమ్రా ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు సరైన సమయంలో ఈ ఆటగాడికి టీం ఇండియా రెస్ట్ ఇవ్వాలి. బంగ్లాదేశ్‌పై కూడా ఈ ఆటగాడికి విశ్రాంతి ఇచ్చి, అతని స్థానంలో షమీకి అవకాశం లభించే అవకాశం ఉంది.

హార్దిక్‌..

బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా కూడా గాయాల బారిన పడ్డాడు. పాండ్యా కూడా ఒకసారి వెన్నులో గాయంతో బాధపడ్డాడు. పాండ్యా పునరాగమనం తర్వాత టీమ్ ఇండియా బ్యాలెన్స్ మెరుగైంది. ఈ ప్రపంచకప్‌లో ముఖ్యమైన సమయాల్లో పాండ్యా టీమిండియాకు వికెట్లు అందించాడు. ఓవరాల్‌గా మంచి ఫాంతో కనిపిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, జట్టు వారిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం.

కేఎల్ రాహుల్‌ను కూడా..

ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ కూడా గాయాలపాలయ్యాడు. తొడ గాయం కారణంగా ఈ ఆటగాడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం రాహుల్ ఫిట్‌గా ఉండడంతో పాటు బ్యాట్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. అయితే టీమ్ ఇండియాకు అవకాశం వస్తే ఈ ఆటగాడికి కూడా విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూగా మ్యాచ్‌లు ఆడటం వల్ల గాయం ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. రాహుల్‌కి ఇదే జరిగితే టీమ్‌ఇండియాకు భారీ నష్టం తప్పదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..