T20 World Cup 2024: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. టీ20 ప్రపంచకప్‌ కెప్టెన్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం

ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ని 4-1 తేడాతో గెల్చుకున్న టీమిండియా ఇప్పుడు మరో కఠిన సవాలుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడేందుకు సఫారీ పర్యటనకు బయలు దేరింది. ఈ టూర్‌లో ముందుగా టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న భారత్‌ ఆ తర్వాత టెస్టు సిరీస్‌ ఆడనుంది. తొలి రెండు సిరీస్‌లకు జట్టులో యువ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

T20 World Cup 2024: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. టీ20 ప్రపంచకప్‌ కెప్టెన్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం
Rohit Sharma

Updated on: Dec 06, 2023 | 4:58 PM

ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ని 4-1 తేడాతో గెల్చుకున్న టీమిండియా ఇప్పుడు మరో కఠిన సవాలుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడేందుకు సఫారీ పర్యటనకు బయలు దేరింది. ఈ టూర్‌లో ముందుగా టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న భారత్‌ ఆ తర్వాత టెస్టు సిరీస్‌ ఆడనుంది. తొలి రెండు సిరీస్‌లకు జట్టులో యువ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భవిష్యత్‌లో జరిగే కీలక టోర్నీల దృష్ట్యా జట్టును రూపొందించేందుకు సెలక్షన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్నందున, బలమైన జట్టును నిర్మించే బాధ్యత ఇప్పుడు బోర్డుపై ఉంది. అయితే ఈ మెగా క్రికెట్‌ టోర్నీలో భారత జట్టును ఎవరు నడిపిస్తారన్న ప్రశ్నకు బీసీసీఐ దగ్గర స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. నిజానికి వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను అత్యంత విజయవంతంగా నడిపించిన రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్‌లో కూడా జట్టును నడిపించాలని సెలక్షన్ బోర్డులో మెజారిటీ సభ్యులు కోరుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఏడాది కాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ కూడా టీ20 ప్రపంచకప్ ఆడటంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. 2024లో టీ20 వరల్డ్ కప్ ఆడే విషయంలో తన స్థానం ఏమిటో బీసీసీఐకి రోహిత్ చెప్పినట్లు సమాచారం.

రోహిత్ కే ఓటు..

2023 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనను సమీక్షించేందుకు ఇటీవల బీసీసీఐ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జట్టు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే రోహిత్ శర్మ రాబోయే T20 ప్రపంచ కప్ ఆడటం గురించి బోర్డుతో మాట్లాడాడు. ‘మీరు నన్ను T20 ప్రపంచ కప్‌కు ఎంపిక చేయాలనుకుంటే, దాని గురించి ఇప్పుడే చెప్పేయండి’ అని అడిగాడు. నివేదిక ప్రకారం, సమావేశంలో పాల్గొన్న అధికారులందరూ, సెలెక్టర్లు మరియు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా రోహిత్ శర్మకు T20 ప్రపంచ కప్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడబానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ నుంచే రోహిత్ టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని సెలక్టర్లు భావించారు. అయితే రోహిత్ కొద్దిరోజులు విరామం కోరినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

భార్య తో రోహిత్ శర్మ..

ఇక దక్షిణాఫ్రికాతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లలో రోహిత్ శర్మ ఆడడం లేదు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతను నేరుగా భారత జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. రోహిత్ అభ్యర్థన మేరకు సెలెక్టర్లు దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీని అప్పగించారు. వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

బోర్డు ఏకగ్రీవ నిర్ణయం?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..