
Rohit Sharma and Virat Kohli Dandiya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో, టీం ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలిచింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2013 సంవత్సరం తర్వాత, భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఈ విధంగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్న తర్వాత, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్టంప్‌లను పెకిలించి కోలాటం ఆడారు. దీంతో ఈ వీడియో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుని, సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెట్టుకుంటూ ఈ ఇద్దరిని చూసి మురిసిపోతున్నారు.
దుబాయ్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన 252 పరుగుల ఛేదనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగుల బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా రెండవసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్నారు. దీంతో వీరి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వీరిద్దరూ స్టంప్‌లను చేతుల్లోకి తీసుకుని వాటితో కోలాటం ఆడారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
The best video on internet today!!😭❤️
Ro-Ko!!🏏🕺🏻#ViratKohli𓃵 #RohitSharma𓃵 #ViratKohli #RohitSharma pic.twitter.com/pizqqWETL7
— ♥️👸🏻🅳🆁🅰🅼🅰🆀🆄🅴🅴🅽👸🏻♥️ (@LaVieThoughts) March 9, 2025
మ్యాచ్ గురించి మాట్లాడితే, న్యూజిలాండ్ తరపున డారిల్ మిచెల్ 101 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేయగా, మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా 53 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కారణంగా న్యూజిలాండ్ భారత్‌కు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా, టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు చేయగా, చివరి వరకు రాహుల్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఒక ఓవర్ ముందు టీం ఇండియా 49 ఓవర్లలో నాలుగు వికెట్ల తేడాతో టైటిల్ విజయాన్ని అందించాడు. ఈ విధంగా, భారత జట్టు వరుసగా రెండోసారి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది.
Rohit Sharma and Virat Kohli are the soul of Team India❤️
Congratulations Team India WE WON
Rohit Sharma, coach Gambhir and all the players of India did what the people of India wanted#ChampionsTrophy2025 #RohitSharma #INDvsNZ#ViratKohli𓃵 INDIA WONpic.twitter.com/W6wJEuJqEC
— Rahul Gupta (@RahulGu04197245) March 9, 2025
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్.
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..