AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: బ్రిస్బేన్‌లో రోహిత్ శర్మ చేసిన 3 తప్పులు.. కట్‌చేస్తే.. కెప్టెన్సీకి పనికిరాడంటూ విమర్శలు..

3 Decision from Rohit Sharma in Brisbane Test: బ్రిస్బేన్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో ఆతిథ్య ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. కంగారూ జట్టు 445 పరుగులు చేసింది. మూడో రోజు కూడా ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని భారత బౌలర్లు కల్పించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా చాలా మంది భారత మాజీ వెటరన్లు రోహిత్ శర్మ కెప్టెన్సీపై […]

Rohit Sharma: బ్రిస్బేన్‌లో రోహిత్ శర్మ చేసిన 3 తప్పులు.. కట్‌చేస్తే.. కెప్టెన్సీకి పనికిరాడంటూ విమర్శలు..
Rohith Sharma
Venkata Chari
|

Updated on: Dec 16, 2024 | 7:49 AM

Share

3 Decision from Rohit Sharma in Brisbane Test: బ్రిస్బేన్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో ఆతిథ్య ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. కంగారూ జట్టు 445 పరుగులు చేసింది. మూడో రోజు కూడా ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని భారత బౌలర్లు కల్పించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా చాలా మంది భారత మాజీ వెటరన్లు రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నలను లేవనెత్తారు.

రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో చేసిన మూడు తప్పులతో భారత జట్టు పర్యవసానాలను చవిచూడాల్సి వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

3. ఫీల్డ్‌ సెట్ చేయడంలో..

మూడోరోజు ఆట ప్రారంభం కాగానే కెప్టెన్ రోహిత్ శర్మ చాలా రక్షణాత్మక ధోరణిని అవలంబించాడు. అతను ఫీల్డర్‌ను చాలా దగ్గరగా ఉంచలేదు. ఈ కారణంగా, ఆస్ట్రేలియా టెయిల్ బ్యాట్స్‌మెన్‌పై ఎటువంటి ఒత్తిడి లేదు. వారు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. రోహిత్ శర్మ చాలా మంది ఆటగాళ్లను స్లిప్‌లో దించాల్సి ఉండగా ఒక్క ఆటగాడు మాత్రమే కనిపించాడు. దీన్ని కంగారూ బ్యాట్స్‌మెన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.

2. ఆటగాళ్లను ప్రోత్సహించకపోవడం..

బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆటగాళ్లలో ఏమాత్రం ఉత్సాహం కనిపించలేదు. మైదానంలో ఏ ఆటగాడు పెద్దగా మాట్లాడలేదు. ఆట చాలా నిశ్శబ్దంగా సాగింది. భారత ఆటగాళ్లు ఎవరూ ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడంతో కామెంటరీ బాక్స్‌లో ఉన్న భారత వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటగాళ్లను ఏమాత్రం ప్రోత్సహించడం లేదు.

1. ఒకే ఎండ్‌లో స్పిన్ బౌలర్..

టెస్ట్ మ్యాచ్ రోజు మొదటి సెషన్ అయినప్పుడు, ఫాస్ట్ బౌలర్లు రెండు ఎండ్‌ల నుంచి బౌలింగ్ చేస్తారని భావిస్తున్నారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ రవీంద్ర జడేజాను ఒక ఎండ్ నుంచి బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. జడేజాపై దాడి చేసి మరీ పరుగులు చేశాడు. మహ్మద్ సిరాజ్‌కు బదులుగా జడేజాను బౌలింగ్‌లో వేసిన రోహిత్ శర్మ నిర్ణయంపై అందరూ ఆశ్చర్యపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!