Team India: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ పుట్టిన రోజు.. ‘లవ్యూ’ అంటూ అక్క విషెస్‌.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలోని బుడ్డోడిని గుర్తు పట్టారా? ఆ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ గా ఒక రేంజ్ లో వెలిగిపోతున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడడమే పనిగా పెట్టుకున్నాడు. డేరింగ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకుని స్టార్ బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. అయితే అతని అసాధారణ విజయం వెనక అంతులేని శ్రమ దాగుంది. భారత క్రికెట్ లో రారాజుగా వెలుగొందుతోన్న ఈ ప్లేయర్..

Team India: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ పుట్టిన రోజు.. 'లవ్యూ' అంటూ అక్క విషెస్‌.. ఎవరో గుర్తు పట్టారా?
Team India Cricketer
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2024 | 1:56 PM

పై ఫొటోలోని బుడ్డోడిని గుర్తు పట్టారా? ఆ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ గా ఒక రేంజ్ లో వెలిగిపోతున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడడమే పనిగా పెట్టుకున్నాడు. డేరింగ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకుని స్టార్ బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. అయితే అతని అసాధారణ విజయం వెనక అంతులేని శ్రమ దాగుంది. భారత క్రికెట్ లో రారాజుగా వెలుగొందుతోన్న ఈ ప్లేయర్ కొన్ని నెలల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయట పడ్డాడు. కానీ తీవ్ర గాయాలతో సుమారు ఒకటిన్నర ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలా మంది మానసికంగా కుంగిపోతారు. కానీ ఈ క్రికెటర్ మాత్రం మనో ధైర్యంతో అన్నిటినీ అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. మునపటి స్థాయి కన్నా మరింత దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టిస్తున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ బుడ్డోడు మరెవరో కాదు మన టీమిండియా వికెట్ కీపర్ కమ్ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్. శుక్రవారం (అక్టోబర్ 04) అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు, భారత క్రికెటర్లు, అభిమానలు, నెటిజన్లు పంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

శుక్రవారం తో 27వ వసంతంలోకి అడుగుపెట్టాడు రిషబ్ పంత్. ఈ సందర్భంగా పంత్‌ సోదరి సాక్షి పంత్‌ అందమైన ఫొటోలతో తమ్ముడికి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ‘‘నా చిట్టి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకంటే చిన్నవాడే అయినా.. నాకు ఒక రక్షణ కవచంలా ఉంటాడు. నీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఐ లవ్‌ యూ సో మచ్‌. నేను స్వేచ్ఛా విహంగంలా విహరించడానికి నాకు బలమైన రెక్కలను ఇచ్చింది నువ్వే. అందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే భయ్యూ’ అని తమ్ముడిపై ప్రేమను కురిపించింది సాక్షి. ప్రస్తుతం ఈ పోస్ట్, పంత్ చిన్ననాటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న ఐపీఎల్‌-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్‌-2024 లోనూ అదరగొట్టి భారత్ కు ప్రపంచకప్ అందించాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టుల్లోనూ సెంచరీతో చెలరేగాడు.

సోదరితో రిషబ్ పంత్..

View this post on Instagram

A post shared by Sakshi Pant (@sakshi.pant)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!