పంత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన గంభీర్.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కీపర్‌గా ఎవరంటే?
మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ కు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఊహించని షాక్ ఇచ్చాడు. జట్టులో ఇద్దరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు ఉన్నారని.. వారిలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందంటూ పేర్కొన్నాడు. ఆ ఒక్కడు కూడా ఎవరో తేల్చేశాడు.

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్‌ను మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో టోర్నీలో బరిలోకి దిగుతోంది. అయితే.. జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో వారిలో ఎవరికి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం ఉందో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తేల్చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన స్క్వౌడ్‌లో కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్ ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా సూపర్ టాలెంటెడ్ ప్లేయర్లు. కానీ, ఒక సామర్థ్యం ఉన్న ఇద్దరు ఆటగాళ్లను ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకునే అవకాశం లేదని, ఇద్దరిలో ఒక్కరు మాత్రమే తుది జట్టులో ఉంటారంటూ గంభీర్ స్పష్టం చేశాడు.
అందులో కూడా తమ ఫస్ట్ ప్రియారిటీ ఎవరో కూడా గంభీర్ పేర్కొనడం విశేషం. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లో కేఎల్ రాహుల్ ఉంటాడంటూ గంభీర్ స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి రాహుల్, పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, చివరి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, 29 బంతుల్లో 40 పరుగులు చేసి వేగంగా ఆడాడు. టీమిండియా భారీ స్కోర్ చేసేందుకు రాహుల్ ఇన్నింగ్స్ ఎంతగానో ఉపయోగపడింది. ఇంగ్లండ్‌తో సిరీస్ కంటే ముందు నుంచే కేఎల్ రాహుల్‌పైనే గంభీర్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమ్‌లో ఉన్న చాలా మంది ఆటగాళ్లకు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడే అవకాశం వచ్చింది. కానీ, రిషభ్ పంత్‌కు మాత్రం గంభీర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ చోటు కల్పించలేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం కేఎల్ రాహుల్‌నే ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని గంభీర్ ముందే ఫిక్స్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.
IND vs PAK: బిగ్ మ్యాచ్‌కు 11 రోజుల ముందే భయంకరమైన న్యూస్.. మరోసారి భారత జట్టుకు డేంజర్ సిగ్నల్?
తాజాగా మీడియా సమావేశంలోనూ గంభీర్ ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ మొదటి ప్రాధాన్యత కేఎల్ రాహుల్ అని పేర్కొన్నాడు. జట్టులో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు ఉన్న సమయంలో ఇద్దర్ని ఆడించడం కుదరదని, కచ్చితంగా ఒక్కరినే ఆడించే అవకాశం ఉంటుందని, అందులో కేఎల్ రాహుల్ నంబర్ వన్‌గా ఉన్నాడంటూ గౌతీ వెల్లడించాడు. గతంలో కేఎల్ రాహుల్ వన్డేల్లో మంచి ప్రదర్శన కనబర్చినట్లు అందుకే కేఎల్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే జట్టులోని ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను కూడా మ్యానేజ్ చేస్తామంటూ గంభీర్ తెలిపాడు. ముఖ్యంగా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ విషయంలో వర్క్‌లోడ్ బ్యాలెన్స్ అయ్యేలా చూస్తామన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




