Ind vs Ban 1st ODI: బంగ్లాతో ఆడుతున్న వన్డే మ్యాచ్‌లో పంత్‌ను తీసుకోకపోవడానికి అదే కారణమా..? అతని స్థానంలో జట్టులోకి ఎవరు వచ్చారంటే..?

|

Dec 04, 2022 | 2:26 PM

ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత్ నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను ఆడుతోంది. బంగ్లా రాజధాని ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య జట్టు..

Ind vs Ban 1st ODI: బంగ్లాతో ఆడుతున్న వన్డే మ్యాచ్‌లో పంత్‌ను తీసుకోకపోవడానికి అదే కారణమా..? అతని స్థానంలో జట్టులోకి ఎవరు వచ్చారంటే..?
Rohit And Pant
Follow us on

ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత్ నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను ఆడుతోంది. బంగ్లా రాజధాని ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య జట్టు సారథి లిట్టన్ దాస్ టాస్ గెలిచాడు. వెనువెంటనే బౌలింగ్‌ను ఎంచుకొని తన సేనతో మైదానంలోకి దిగాడు. అయితే టాస్ అయిపోయి, బంగ్లా టీమ్ మైదానంలోకి ప్రవేశించే ముందుగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. గాయాల కారణంగా రిషభ్ పంత్‌ను టీమ్‌లోకి తీసుకోలేకపోతున్నామని తెలిపాడు. ఇంకా అతనికి బదులుగా యువ ఆటగాడు కుల్దీప్ సేన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే కుల్దీప్ సేన్‌ ఈ రోజే తన వన్డే ఫార్మాట్ ఆరంగేట్రం చేశాడు. టాస్ ప్రక్రియ తర్వాత మైదానంలోకి దిగిన బంగ్లా టీమ్ తమ బౌలింగ్ విధానాలతో మన ఆటగాళ్లను బాగా కట్టడిచేయగలిగారు.

ఫామ్ లేని ఆటగాళ్లతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు.. గాయాల కారణంగా రిషభ్ పంత్‌ను కూడా కోల్పోయింది. దీంతో పంత్ స్థానంలో కుల్దీప్ సేన్‌ను జట్టులోకి తీసుకుని అతనితో ఆరంగేట్రం చేయించాడు రోహిత్. కాగా రానున్న ప్రపంచకప్ కోసం వేసుకున్న ప్రణాళికల్లో ఇది భాగమేనని తెలుస్తోంది. ఇంకా గాయాల కారణంగా సీనియర్ ఆటగాళ్లు జట్టులో  లేకపోవడంతో నలుగురు అల్‌రౌండర్లతో మ్యాచ్‌కు వెళ్తున్నట్లు రోహిత్ తెలిపాడు. ఇంకా ..‘‘నిజాయితీగా చెప్పాలంటే పిచ్ కండీషన్స్‌పై నాకు క్లారిటీ లేదు. కాస్త తేమగా ఉండటంతో ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నా. జట్టులో ఆటగాళ్ల గాయాలు, ఊహించని సమస్యలతో నలుగురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షెహ్‌బాజ్ అహ్మద్, దీపక్ చాహర్‌ జట్టులోకి వచ్చారు. కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు.  గాయాలతో స్టార్ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలోనే నలుగురు ఆల్‌రౌండర్లను తీసుకున్నామ’’ని రోహిత్ శర్మ టాస్ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా, రిషభ్ పంత్  ఆరోగ్యం గురించి వైద్యుల సూచనల మేరకే జట్టులో నుంచి అతన్ని  తప్పించామని.. టెస్ట్ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడిన బీసీసీఐ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

 

చేతులెత్తేసిన భారత ఆటగాళ్లు..

ఇప్పటివరకు జరిగిన వన్డే మ్యాచ్‌లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగుల వద్ద భారత్ ఉంది.  కెఎల్ రాహుల్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా నేటి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్(27), ధావన్(7) అనుకున్నస్థాయిలో  ప్రదర్శన కనబర్చలేక నిరుత్సామపరిచారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(9) కూడా చేతులెత్తేశాడు. శ్రేయస్ అయ్యర్(24), వాషింగ్టన్ సుందర్(19) కూడా క్రీజులోకి వచ్చి నిలదొక్కుకునే లోపే  పెవీలియన్ బాట పట్టారు. ఇక వికెట్ కీపర్ కెఎల్ రాహుల్  మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి క్రీజులో నిలబడ్డాడు ఇంకా ఉన్నాడు.  హెహ్బాజ్ అహ్మద్, దీపక్ చాహర్ డకౌట్ కాగా, శార్దూల్ ఠాకూర్ 2 పరుగులకే  ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(55), మొహమ్మద్ సిరాజ్(2) ఉన్నారు. మరో వైపు బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హాసన్ 5 వికెట్లను పడగొట్టి చెలరేగిపోయాడు. అతనికి తోడుగా ఎబడోర్ హొస్సేన్ 2, మెహిదీ హాసన్ మీరజ్ 1 వికెట్ తీసుకున్నారు.