Rishabh Pant: పంత్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల కీలక ప్రకటన.. ఆస్పత్రి మార్పుపై ఏమంటున్నారంటే?

|

Jan 02, 2023 | 9:00 AM

తొలి రోజుతో పోలిస్తే పంత్ వేగంగా కోలుకున్నాడు. గత రెండున్నర రోజులుగా పంత్ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతానికి అతనిని మరో ఆసుపత్రిలో చేర్చే ఆలోచన లేదని పంత్ ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఉమేష్ కుమార్ తెలిపారు.

Rishabh Pant: పంత్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల కీలక ప్రకటన.. ఆస్పత్రి మార్పుపై ఏమంటున్నారంటే?
Rishabh Pant
Follow us on

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఆరోగ్యం మెరుగుపడుతుందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను త్వరగా కోలుకుంటాడని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి రోజుతో పోలిస్తే పంత్ వేగంగా కోలుకున్నాడు. గత రెండున్నర రోజులుగా పంత్ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతానికి అతనిని మరో ఆసుపత్రిలో చేర్చే ఆలోచన లేదని పంత్ ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఉమేష్ కుమార్ తెలిపారు. ఇక డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. ‘పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అతను త్వరగా కోలుకుంటున్నాడు. మా బీసీసీఐ వైద్యులు ఇక్కడి వైద్యులతో టచ్‌లో ఉన్నారు. జై షా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి పంత్‌కి ఇక్కడే చికిత్స అందించనున్నారు’ అని పేర్కొన్నాడు. ఇక కారు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడినా పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాళ్లు, చేతులు బాగా దెబ్బతిన్నాయి. దీని కారణంగా కనీసం ఎనిమిది నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.

కాగా త్వరలో జరిగే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌తో సహా ఐపీఎల్‌ 2023 సీజన్‌ కు దూరం కానున్నాడు పంత్‌. కాగా డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న రిషబ్‌ పంత్‌ను ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి పరామర్శించారు. ఆస్పత్రికి చేరుకున్న సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి.. రిషబ్‌ పంత్‌ ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిషబ్ పంత్ ను పరామర్శించి. ఆపై మీడియాతో మాట్లాడారు. క్రికెటర్ కారు ప్రమాదానికి గురైన తర్వాత ఉత్తరాఖండ్ సీఎం ధామి.. పంత్ కుటుంబంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. పంత్ ఆరోగ్యంపై సీఎంకు సమాచారం అందించే బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..