Rishabh Pant Health: రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్.. 3 గంటలపాటు సర్జరీ.. ఇప్పుడెలా ఉన్నాడంటే?

|

Jan 07, 2023 | 2:55 PM

భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురైంది. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్కడి నుంచి విమానంలో ముంబై తరలించి కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు.

Rishabh Pant Health: రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్.. 3 గంటలపాటు సర్జరీ.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
Rishabh Pant Health Update
Follow us on

కారు ప్రమాదంలో గాయపడిన భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇప్పుడు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, నేడు పంత్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ వచ్చింది. రిషబ్ పంత్‌కు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ తర్వాత, స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పంత్ స్పందన బాగుందంట. ఈ శస్త్రచికిత్స కుడి కాలు మోకాలిపై స్నాయువుపై జరిగింది. ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేరిన రిషబ్‌ పంత్‌కు శుక్రవారం ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ డాక్టర్ దిన్షా పద్రివాలా చేశారు. ఈ శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ సుమారు 3 నుంచి 4 రోజుల పాటు పరిశీలనలో ఉండనున్నాడు.

మూడు గంటల పాటు ఆపరేషన్..

ఈ ఆపరేషన్ దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. రిషబ్ పంత్ చికిత్స తర్వాత బాగానే ఉన్నాడు. అతని స్పందన కూడా బాగుంది. కారు ప్రమాదం తర్వాత, రిషబ్ పంత్ తల, వీపు, కాలు, మోకాలు, చీలమండపై తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పంత్‌ను విమానంలో తరలించి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించింది.

రూర్కీ సమీపంలో పంత్‌ కారు ప్రమాదం..

గాయం కారణంగా శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు రిషబ్ పంత్‌ను ఎంపిక చేయలేదు. పునరావాసం కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లాల్సిందిగా రిషబ్ పంత్‌ను బీసీసీఐ కోరింది. అయితే అంతకు ముందు క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు దుబాయ్ వెళ్లాడు. ఇక్కడ అతను మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత, రిషబ్ పంత్ ఇండియాకు తిరిగి వచ్చి తన కారులో ఢిల్లీ నుంచి తన సొంత పట్టణం రూర్కీకి వెళ్తున్నాడు. ఇంతలో, డిసెంబర్ 30 తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. రూర్కీ సమీపంలోని గురుకుల్ నర్సన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో రిషబ్ పంత్ ఒంటరిగా ఉండి స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఎయిర్ బెలూన్ పగలగొట్టి బయటకు వచ్చానని పంత్ చెప్పాడు. అనంతరం కారులో భారీగా మంటలు చెలరేగాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..