టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీలోని తన ఇంటికి వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో పంత్‌కు తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా పంత్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో అతివేగంగా వస్తోన్న కారు నియంత్రణ కోల్పోయి మొదట రైలింగ్‌ను ఢీ కొట్టింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే సకాలంలో స్పందించిన పంత్ ఎలాగోలా కారు నుండి బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. రెప్పపాటులోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతివేగం కారణంగానే పంత్ ప్రమాదం బారిన పడినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సందేశాలు పంపుతున్నారు.
కాగా కారులో నుంచి బయటపడ్డ పంత్‌ను ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అతని ముఖం రక్తంతో తడిసిపోవడంతో వెంటనే అతనిని పట్టుకుని ఆస్పత్రికే తరలించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో గుంపులో ఉన్న కొందరు అత్యుత్సాహంతో పంత్ ను ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే నిస్సహాయ స్థితిలో ఉన్న పంత్ వారిని గమనించి కాస్త కోపగించుకున్నాడు. వీడియోలు తీయద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. కాగా ఈ వీడియోలో పంత్ ముఖమంతా రక్తంతో తడిసిపోవడం మనం చూడవచ్చు. కళ్లు, పెదవులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
#WATCH | Cricketer Rishabh Pant met with an accident on the Delhi-Dehradun highway near Roorkee border. He is currently stable and undergoing treatment at Max Hospital, Dehradun
(CCTV Visuals source: Police) pic.twitter.com/GF5E2X5iYa
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 30, 2022
This video is told to be of Rishabh Pant’s recent accident in Uttarakhand. Vehicle can be seen on fire and Pant is lying on the ground. @TheLallantop pic.twitter.com/mK8QbD2EIq
— Siddhant Mohan (@Siddhantmt) December 30, 2022
#RishabhPant accident : first video after accident…Pant seen bleeding #GetwellSoon #Roorkee pic.twitter.com/Kr2jplLpd6
— Sonu Kanojia (@NNsonukanojia) December 30, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..