Watch Video: భారీ సిక్స్‌లతో రింకూ బీభత్సం.. కట్‌చేస్తే.. సౌతాఫ్రికా క్రికెట్‌కు భారీ నష్టం.. ఎందుకో తెలుసా?

Rinku Singh Six Video, South Africa vs India 2nd T20I: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో T20I మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ, టీమిండియా యువ ఫినిషర్ రింకూ సింగ్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను కొట్టిన రెండు సిక్సర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అందులో ఒకటి సిక్స్ ప్రెస్ బాక్స్ అద్దానికి తగిలింది.

Watch Video: భారీ సిక్స్‌లతో రింకూ బీభత్సం.. కట్‌చేస్తే.. సౌతాఫ్రికా క్రికెట్‌కు భారీ నష్టం.. ఎందుకో తెలుసా?
Rinku Singh Six Video Ind V
Follow us
Venkata Chari

|

Updated on: Dec 13, 2023 | 11:20 AM

Rinku Singh Six Video, South Africa vs India 2nd T20I:  గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. కానీ, టీమ్ ఇండియా యువ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) సౌతాఫ్రికా గడ్డపై తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన బ్యాటింగ్‌లో రింకూ కేవలం 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేసింది. దీని ద్వారా జట్టు స్కోరును 180 అంచులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. రింకూ కొట్టిన రెండు సిక్సర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. వాటిలో ఒక సిక్స్ మీడియా బాక్స్ అద్దాన్ని పగులగొట్టింది.

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ బౌలింగ్‌లో రింకూ రెండు భారీ సిక్సర్లు బాదాడు. అందులో ఒకటి ప్రెస్ బాక్స్ అద్దానికి తగిలింది. దీంతో ఆఫ్రికాకు భారీ నష్టం వాటిల్లింది. 19వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో భారత్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన సమయంలో వర్షం జోక్యం చేసుకుంది. అనంతరం దక్షిణాఫ్రికాకు డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆఫ్రికన్ జట్టు DLS పద్ధతిలో కేవలం 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సిరీస్‌లోని మూడో మ్యాచ్ డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రెట్జ్కీ, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సన్, ఆండిల్ ఫెలుక్వాయ్, గెరాల్డ్ కోయెట్జీ, తబ్రైజ్ షమ్సీ, లిజాద్ విలియమ్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..