ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక పోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ 16వ సీజన్‌లో కోహ్లి సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తరపున కోహ్లిది తొలి శతకం కాగా.. ఓవరాల్‌గా సీజన్‌లో ఇది ఏడో శతకం. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకం సాధించిన కోహ్లి 35 బంతుల్లో తొలి ఫిఫ్టీ, తర్వాత ఫిఫ్టీని 26 బంతుల్లో అందుకున్నాడు. డుప్లిస్‌తో కలిసి 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లికి ఐపీఎల్‌లో ఇది ఆరో శతకం కాగా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ శతకంతో మెరిసి అభిమానులను మురిపించాడు. అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో కోహ్లి సెంచరీ సాధించడం అభిమానులను సంతోషపెట్టింది. అంతేకాదు ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్రస్తుతం 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది ఆర్సీబీ. ఎల్లుండి గుజరాత్‌తో జరిగే మ్యాచ్ గెలిచి తీరాలి.
కాగా సరిగ్గా ఏడేళ్ల క్రితం అంటే 2016 మే 18న పంజాబ్ పై కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ సీజన్ లో ఆర్సీబీ ఫైనల్ కి వెళ్లింది కానీ సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది.
ఇప్పుడు హైదరాబాద్ జట్టు అసలు ఫ్లే ఆఫ్స్ రేసులోనే లేదు. కావున ఈ సీజన్ లో ఆర్సీబీ టాప్-4లో అడుగుపెట్టి, అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తే కప్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ఈసారి కోహ్లీ టీమ్ కప్ కొడుతుందనే పాజిటివ్ వైబ్స్ కనిపించడానికి మరో కారణం కోహ్లీ-డుప్లెసిస్. 2016లో కోహ్లీ-డివిలియర్స్ కలిసి 800 పరుగులకు పైగా రన్స్ చేశారు. తాజా సీజన్‌లో కోహ్లీ-డుప్లెసిస్ కలిసి పరుగుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే 800 పరుగులకు పైగా రన్స్ జోడించారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఆదివారం గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో భారీ విజయం సాధించాలి. అదే సమయంలో
ముంబయి, సన్ రైజర్స్ చేతిలో ఓడిపోవాలి లేదంటే తక్కువ పరుగుల తేడాతో గెలవాలి. అప్పుడే రన్ రేట్ విషయంలో ఆర్సీబీ ముందుంటుంది. ప్లే ఆఫ్స్ కి ఈజీగా చేరుకుంటుంది. ఇలా ఇవన్నీ కలిసొస్తే 2016లో త్రుటిలో చేజార్చుకున్న ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ గెలుచుకోవచ్చు.
? Bow down to the greatness of ? #ViratKohli ?
He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds ?#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6
— JioCinema (@JioCinema) May 18, 2023
???-????? fifty from the #RCB skipper ❤️
No stopping the #IPL2023 Orange Cap leader ?#SRHvRCB #IPLonJioCinema #TATAIPL #EveryGameMatters pic.twitter.com/s2cYlqneW4
— JioCinema (@JioCinema) May 18, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..