
Will Jacks, 5 Sixes in an Over: టీ20 క్రికెట్ ఎంట్రీ ఇచ్చాక.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ అందుతోంది. ఫోర్లు, సిక్స్‌ల మోతలతో మైదానంలో ఉత్సాహం పీక్స్‌కి చేరుతోంది. ఈ ఇన్‌స్టంట్ క్రికెట్ ఆధిపత్యం పెరిగిపోవడంతో అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు మరింతగా రెచ్చిపోయే ఛాన్స్ కూడా పెరిగింది. టెస్టుల్లో కూడా ఫోర్లు, సిక్సర్లు బాదడంలో బ్యాట్స్‌మెన్ వెనుకంజ వేయడం లేదు. ఓ ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ వేగంగా మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి సంచలనంగా మారాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
సిక్సర్ల వర్షం కురిపించిన ఈ ఆటగాడిని వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతను IPL-2023 నుంచి వైదొలగవలసి రావడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఐపీఎల్‌లో, గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి చరిత్ర పుటల్లో లిఖించుకున్న రింకూ సింగ్‌లాగే.. విల్ జాక్స్ కూడా వైటాలిటీ బ్లాస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో విల్ జాక్వెస్ అద్భుత ప్రదర్శన చేశాడు. మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్రే ఓపెనర్ విల్ జాక్స్ ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. అయితే కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.
5 consecutive sixes by Will Jacks in a single over.
RCB player to watch out in IPL 2024.pic.twitter.com/L6hc1r7UWe
— Johns. (@CricCrazyJohns) June 22, 2023
అయితే, మిడిల్‌సెక్స్ జట్టు సర్రేని 7 వికెట్ల తేడాతో ఓడించింది. సర్రే జట్టు 7 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు చేయగా, మిడిల్‌సెక్స్ 3 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది. సర్రే ఇన్నింగ్స్‌లోని 11వ ఓవర్‌లో, లెగ్ స్పిన్నర్ ల్యూక్ హాల్‌మన్ వేసిన మొదటి 5 బంతుల్లో విల్ జాక్ 5 సిక్సర్లు కొట్టాడు. 2019లో, దుబాయ్‌లో జరిగిన ప్రీ-సెషన్ T10 మ్యాచ్‌లో లంకేషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో జాక్వెస్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..