కింగ్స్‌పై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్

వరుస ఓటములతో సతమతమైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎట్టకేలకు ఫ్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పోరాడగలుగుతోంది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్‌ 44 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, స్టొయినిస్‌‌ 34 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచారు. అనంతరం […]

కింగ్స్‌పై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్

Edited By:

Updated on: Apr 25, 2019 | 7:33 AM

వరుస ఓటములతో సతమతమైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎట్టకేలకు ఫ్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పోరాడగలుగుతోంది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్‌ 44 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, స్టొయినిస్‌‌ 34 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచారు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు…నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 185 పరుగులకే పరిమితమైంది. భారీ టార్గెట్ చేధనను ధాటిగా ప్రారంభించిన పంజాబ్… 3.1 ఓవర్లలోనే 42 పరుగులు రాబట్టింది. అయితే 10 బంతుల్లో 23 పరుగులు చేసిన క్రిస్‌గేల్‌ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. అనతంరం క్రీజ్ లోకి వచ్చిన పూరన్‌ 46 పరుగులు, రాహుల్‌ 42 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపారు. అయితే ఆఖరి ఓవర్లో విజయానికి 26 పరుగులు కావల్సిన దశలో పంజాబ్ 9 పరుగులే రాబట్టగలిగింది. ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా, నవ‌దీప్‌ శైనీకు రెండు, మొయిన్ ఆలీ, స్టోయినిస్‌లకు చెరో వికెట్ దక్కాయి. డివిలియర్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.