జడేజా @ 88.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే పరమ చెత్త రికార్డ్‌లో మనోడు..!

Ravindra Jadeja No Balls: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు నోబాల్స్‌ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీలంకతో రెండో టెస్టులోనే నాలుగు నోబాల్స్‌ వేసిన జడేజా.. 2021 నుంచి తన ఖాతాలో 88 నోబాల్స్‌ నమోదు చేసుకున్నాడు. ఈ గణాంకం టెస్టు క్రికెట్‌లో అతడి స్థానాన్ని ఆశ్చర్యకరంగా మార్చేసింది.

జడేజా @ 88.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే పరమ చెత్త రికార్డ్‌లో మనోడు..!
Ravindra Jadeja No Balls

Updated on: Aug 26, 2026 | 8:35 PM

Ravindra Jadeja No Balls: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో జడేజా బౌలింగ్‌ నుంచి నాలుగు నోబాల్స్‌ వచ్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో మరో ఒక నోబాల్‌ వేశాడు. దీంతో 2021 నుంచి టెస్టుల్లో జడేజా వేసిన నోబాల్స్‌ సంఖ్య 88కి చేరింది. స్పిన్నర్లలో ఈ కాలంలో ఇంతకంటే ఎక్కువ నోబాల్స్‌ వేసిన బౌలర్‌ లేడు. పాకిస్థాన్‌ స్పిన్నర్‌ నోమన్‌ అలీ 40 నోబాల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. అంటే జడేజా సంఖ్య అతడి కంటే రెండింతలకు పైగా ఉంది. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో ఇదే సమస్య తొలి టెస్టులోనూ కనిపించింది.

తొలి టెస్టులోనూ తప్పని అదే సమస్య..

గాలేలో జరిగిన తొలి టెస్టులో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ చెరో రెండు నోబాల్స్‌ వేశాడు. వాటిలో ఒక నోబాల్‌ శ్రీలంక బ్యాటర్‌ ధనంజయ డి సిల్వాకు భారీ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు రెండో టెస్టులో మరో నాలుగు నోబాల్స్‌ రావడంతో జడేజా గణాంకం మరింత పెరిగింది.

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

ఇవి కూడా చదవండి

జడేజా తర్వాత ఎవరు?

2021 నుంచి టెస్టుల్లో స్పిన్నర్లు వేసిన నోబాల్స్‌ జాబితాలో జడేజా 88తో అగ్రస్థానంలో ఉన్నాడు. నోమన్‌ అలీ 40తో రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకకు చెందిన లసిత్‌ ఎంబుల్డెనియా 33 నోబాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ 19, జోమెల్‌ వారికన్‌, జాహిర్‌ ఖాన్‌ చెరో 17 నోబాల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

2021 నుంచి టెస్ట్ ల్లో స్పిన్నర్లు వేసిన అత్యధిక నో-బాల్స్..

88* – రవీంద్ర జడేజా

40 – నోమాన్ అలీ

33 – లసిత్ ఎంబల్దేనియా

19 – జాక్ లీచ్

17 – జోమెల్ వార్రికన్

17 – జహీర్ ఖాన్

ఇదే టెస్టులో భారత్‌ మాత్రం ఆధిపత్యంలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 503/9 డిక్లేర్‌ చేసిన టీమిండియా, శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్‌ చేసి ఫాలోఆన్‌ ఆడించింది. నాలుగో రోజు వర్షం కారణంగా ఆట ముందుగానే ముగిసే సమయానికి శ్రీలంక 229/6తో ఉంది. పసిండు సూర్యబండార 92, కమిందు మెండిస్ 55 పరుగులు చేశారు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

జడేజా వికెట్లతో జట్టుకు ఉపయోగపడుతున్నా, నోబాల్స్‌ గణాంకం మాత్రం అతడికి ఇబ్బందికరంగానే మారుతోంది. 2021 నుంచి 88 నోబాల్స్‌తో స్పిన్నర్లలో అగ్రస్థానంలో ఉండటం ఈ సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us