మీ అండతో.. చివరి శ్వాస వరకూ పోరాడుతా – జడేజా

| Edited By: Srinu

Jul 11, 2019 | 8:46 PM

మాంచెస్టర్: టీమిండియా ప్రపంచకప్ కల చెదిరిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి.. అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఒక దశలో భారత్ భారీ పరుగుల తేడాతో ఓటమికి చేరువ అవుతున్న తరుణంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ధోని సాయంతో చెలరేగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కీలక సమయాల్లో ఒత్తిడికి లోనయ్యి వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి చవి చూసింది. ఇది ఇలా […]

మీ అండతో.. చివరి శ్వాస వరకూ పోరాడుతా - జడేజా
Follow us on

మాంచెస్టర్: టీమిండియా ప్రపంచకప్ కల చెదిరిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి.. అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఒక దశలో భారత్ భారీ పరుగుల తేడాతో ఓటమికి చేరువ అవుతున్న తరుణంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ధోని సాయంతో చెలరేగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కీలక సమయాల్లో ఒత్తిడికి లోనయ్యి వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి చవి చూసింది.

ఇది ఇలా ఉండగా రవీంద్ర జడేజా తన ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. చివరి శ్వాస వరకూ తన నుంచి బెస్ట్ ఇస్తూనే ఉంటానని ట్వీట్‌లో పేర్కొన్నాడు. పడిన ప్రతీసారి తిరిగి లేవడానికి తనకు సపోర్ట్ చేసిన అభిమానులందరికి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లిష్టమైన సమయంలో 77 పరుగులు చేసి ఇండియాను గెలుపు అంచుల దాకా జడ్డు తీసుకెళ్లాడు.