AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే బుర్ర కరాబే..!

Ravindra Jadeja DRS: రవీంద్ర జడేజాకు టెస్టు క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ మరోసారి చేదు అనుభవాన్నే మిగిల్చింది. శ్రీలంకతో రెండో టెస్టులో కేశర నువంతపై తీసుకున్న సమీక్ష కూడా విఫలమైంది. దీంతో బౌలర్‌గా జడేజా వరుసగా 22 డీఆర్‌ఎస్‌ రివ్యూల్లో ఒక్కటీ సక్సెస్‌ కాకపోవడం ఇప్పుడు చర్చగా మారింది.

Team India: 22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే బుర్ర కరాబే..!
Ravindra Jadeja Drs (1)
Venkata Chari
|

Updated on: Aug 26, 2026 | 9:07 PM

Share

Ravindra Jadeja DRS: శ్రీలంకతో రెండో టెస్టు మూడో రోజు జడేజా బౌలింగ్‌లో కేశర నువంత ఎల్బీడబ్ల్యూగా చిక్కాడంటూ భారత్‌ అప్పీల్‌ చేసింది. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో జడేజా కెప్టెన్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్‌ కోరాడు. రీప్లేలో బంతికి బ్యాట్‌ లోపలి అంచు తగిలినట్లు తేలడంతో భారత్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ సమీక్షతో జడేజా బౌలర్‌గా వరుసగా విఫలమైన డీఆర్‌ఎస్‌ ప్రయత్నాల సంఖ్య 22కి చేరింది. వీటిలో నాలుగు అంపైర్స్‌ కాల్‌గా ముగిశాయి. మిగిలిన 18 రివ్యూల్లో భారత్‌ సమీక్షను కోల్పోయింది. బౌలర్‌గా జడేజా చివరిసారి విజయవంతమైన డీఆర్‌ఎస్‌ 2023 జులైలో డొమినికాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో వచ్చింది.

చివరి విజయవంతమైన రివ్యూ ఎప్పుడు?

వెస్టిండీస్‌ బ్యాటర్‌ కెమర్‌ రోచ్‌ను ఔట్‌ చేయడానికి జడేజా అప్పటి కెప్టెన్‌ను సమీక్షకు ఒప్పించాడు. అంపైర్‌ నాటౌట్‌గా ఇచ్చిన నిర్ణయం రీప్లే తర్వాత మారడంతో ఆ రివ్యూ భారత్‌కు అనుకూలంగా మారింది. ఆ తర్వాత మాత్రం జడేజాకు సరైన నిర్ణయం దక్కలేదు.

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

ఇవి కూడా చదవండి

శ్రీలంకతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లోనూ ఇదే సమస్య కనిపించింది. రెండో టెస్టులో కేశర నువంతపై తీసుకున్న సమీక్ష కూడా ఫలించకపోవడంతో అతడి వరుస విఫల సమీక్షల పరంపర కొనసాగింది.

350 వికెట్లతో చరిత్ర.. మరో అరుదైన ఘనత..

డీఆర్‌ఎస్‌లో ఇబ్బందులు ఉన్నా జడేజా టెస్టు కెరీర్‌లో మాత్రం కీలక మైలురాళ్లు సాధించాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 350 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత ఎడమచేతి బౌలర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జహీర్‌ ఖాన్‌ 311 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

350 టెస్టు వికెట్లు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో జడేజా ఐదో స్థానంలో ఉన్నాడు. అతడికంటే ముందు అనిల్‌ కుంబ్లే 619, రవిచంద్రన్‌ అశ్విన్‌ 537, కపిల్‌ దేవ్‌ 434, హర్భజన్‌ సింగ్‌ 417 వికెట్లు సాధించారు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

జడేజా ప్రపంచంలో 350 టెస్టు వికెట్లు సాధించిన మూడో ఎడమచేతి స్పిన్నర్‌గా కూడా నిలిచాడు. రంగనా హెరాత్‌ 433, డేనియల్‌ వెట్టోరి 362 వికెట్లతో అతడికంటే ముందు ఉన్నారు. మరోవైపు 4000కు పైగా టెస్టు పరుగులు, 350కు పైగా వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా జడేజా అరుదైన జాబితాలో చేరాడు.

జడేజా టెస్టు కెరీర్‌లో అద్భుతమైన మైలురాళ్లు సాధిస్తున్నా, బౌలర్‌గా డీఆర్‌ఎస్‌ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 22 వరుస రివ్యూల్లో ఒక్కటీ సక్సెస్‌ కాకపోవడం అతడి గణాంకాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us