Ravindra Jadeja: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 15 రన్స్ తేడాతో ధోని సేన గెలిచి, ఐపీఎల్ ఫైనల్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన కెరీర్‌లో మరో మైలురాయిని తాకాడు. రవీంద్ర జడేజా తన ఐపీఎల్ కెరీర్‌లో 150వ వికెట్లను పూర్తి చేసుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ దసున్ షనకను ఔట్ చేయడం ద్వారా జడేజా తన 150వ వికెట్‌ను తీసుకున్నాడు. అలాగే డేవిడ్ మిల్లర్‌ని కూడా పెవిలియన్ బాట పట్టించి నిన్నటి మ్యాచ్‌లోనే 151వ వికెట్‌ను కూడా తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ చరిత్రలో 150వ వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా, అలాగే ఈ లీగ్‌లో 150 వికెట్ల మార్క్‌ని అందుకున్న 10వ ఆటగాడిగా జడేజా నిలిచాడు.
అయితే ఐపీఎల్‌లో లెఫ్టార్మ్ బౌలర్లు అయిన ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సాధించలేని ఘనతను జడేజా అందుకున్నాడు. ఇక ఐపీఎల్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్ల టాప్ 5 స్థానాలలో జడేజా(151) తర్వాత అక్షర్ పటేల్(112), ఆశిష్ నెహ్రా(106), ట్రెంట్ బౌల్ట్(105), జహీర్ ఖాన్(102) వరుసగా ఉన్నారు. ఇంకా జడేజా తన 150 వికెట్ల మార్క్‌ను అందుకోవడానికి 225(196 ఇన్నింగ్స్) ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
What a ball by Sir Jadeja ?pic.twitter.com/A4TUrgOCa1
— Johns. (@CricCrazyJohns) May 23, 2023
1️⃣5️⃣0️⃣ UP ?
Ravindra Jadeja completes 150 IPL wickets ???? #TATAIPL | #Qualifier1 | #GTvCSK | @imjadeja pic.twitter.com/LQODvlIUWv
— IndianPremierLeague (@IPL) May 23, 2023
మరోవైపు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(187 వికెట్లు) పేరిట ఉంది. అత్యధిక ఐపీఎల్ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా లసిత్ మలింగ 183 వికెట్లతో తన కెరీర్ ముగించగా.. ఇటీవలే చాహల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంకా ప్రస్తుతం మలింగ 183 వికెట్లతో రెండో స్థానంలో, పీయూష్ చావ్లా(177) మూడో స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..