IND vs ENG: అశ్విన్‌తో సహా ఈ వారం ‘వంద’ కొట్టనున్న క్రికెటర్లు వీరే.. లిస్టులో మనందరి ఫేవరెట్ ప్లేయర్

|

Mar 05, 2024 | 12:31 PM

ఈ వారంలో నలుగురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లో 100వ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నలుగురిలో టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉండడం విశేషం. ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగే 5వ టెస్టు మ్యాచ్‌లో ఆడితే.. టీమిండియా తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ ప్రత్యేక రికార్డు లిఖిస్తాడు

IND vs ENG: అశ్విన్‌తో సహా ఈ వారం వంద కొట్టనున్న క్రికెటర్లు వీరే.. లిస్టులో మనందరి ఫేవరెట్ ప్లేయర్
R Ashwin
Follow us on

ఈ వారంలో నలుగురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లో 100వ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నలుగురిలో టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉండడం విశేషం. ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగే 5వ టెస్టు మ్యాచ్‌లో ఆడితే.. టీమిండియా తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ ప్రత్యేక రికార్డు లిఖిస్తాడు. అలాగే, ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో కూడా 99 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. దీని ప్రకారం.. టీమిండియాతో జరిగే 5వ టెస్టు మ్యాచ్‌లో బెయిర్‌స్టో కనిపిస్తే.. 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ప్రత్యేక ఘనతను సాధిస్తాడు. న్యూజిలాండ్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కూడా తమ 100వ టెస్టు మ్యాచ్‌ను ఆడే దశలో ఉన్నారు. కేన్ విలియమ్సన్ ఆస్ట్రేలియాతో 2వ టెస్టు మ్యాచ్‌లో ఆడితే 100 టెస్టు మ్యాచ్‌ల రికార్డును అందుకుంటాడు. అలాగే, న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్ టిమ్ సౌథీ ఆస్ట్రేలియాతో జరిగే 2వ టెస్టు మ్యాచ్ ద్వారా 100 టెస్టు మ్యాచ్‌లను పూర్తి చేయనున్నాడు. మరికొద్ది రోజుల్లోనే 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రికార్డును నలుగురు ఆటగాళ్లు లిఖించబోతుండడం విశేషం.

కేన్ మామా కూడా ఉన్నాడుగా..

100 కు పైగా టెస్ట్ మ్యాచ్ లు ఆడిన భారతీయ క్రికెటర్లు వీరే..

  1. సచిన్ టెండూల్కర్
  2. రాహుల్ ద్రవిడ్
  3. వీవీఎస్ లక్ష్మణ్
  4. అనిల్ కుంబ్లే
  5. కపిల్ దేవ్
  6. సునీల్ గవాస్కర్
  7. దిలీప్ వెంగ్‌సర్కార్
  8. సౌరవ్ గంగూలీ
  9. విరాట్ కోహ్లీ
  10. ఇషాంత్ శర్మ
  11. హర్భజన్ సింగ్
  12. వీరేంద్ర సెహ్వాగ్
  13. చెతేశ్వర్ పుజారా.

ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 14వ ఆటగాడిగా నిలవనున్నాడు. అలాగే ప్రస్తుత ఆటగాళ్లలో ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ ప్రత్యేక సాధకుల జాబితాలోకి రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరనున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..