CSK vs PBKS Match Report: సొంతగడ్డపై చెన్నైకు షాకిచ్చిన పంజాబ్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం..

Chennai Super Kings vs Punjab Kings, 49th Match: IPL-2024 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. చెన్నైపై పంజాబ్‌కు ఇది వరుసగా 5వ విజయం. ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు అలాగే ఉన్నాయి. 4 విజయాలతో ఆ జట్టు 8 పాయింట్లు సాధించింది.

CSK vs PBKS Match Report: సొంతగడ్డపై చెన్నైకు షాకిచ్చిన పంజాబ్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం..
Csk Vs Pbks Match Result

Updated on: May 01, 2024 | 11:38 PM

Chennai Super Kings vs Punjab Kings, 49th Match: IPL-2024 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. చెన్నైపై పంజాబ్‌కు ఇది వరుసగా 5వ విజయం. ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు అలాగే ఉన్నాయి. 4 విజయాలతో ఆ జట్టు 8 పాయింట్లు సాధించింది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు అలాగే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 7వ స్థానానికి చేరుకుంది.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో పంజాబ్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ సామ్ కుర్రాన్ 26 పరుగులతో నాటౌట్ గా, శశాంక్ సింగ్ 25 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగారు.

PBKS ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 46 పరుగులు, రిలే రూస్ 43 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, శివమ్ దూబేలకు ఒక్కో వికెట్ దక్కింది.

అంతకుముందు పంజాబ్ కింగ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సీఎస్‌కే తరపున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను నాలుగో అర్ధ సెంచరీ సాధించాడు. గైక్వాడ్‌కి ఇది వరుసగా మూడో 50+ స్కోరు. అజింక్యా రహానే 29 పరుగులు, సమీర్ రిజ్వీ 21 పరుగులు, ఎంఎస్ ధోని 14 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ 2-2 వికెట్లు తీశారు. కగిసో రబడా, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు చెరో వికెట్ దక్కింది.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, విధ్వత్ కవేరప్ప, హర్‌ప్రీత్ సింగ్ భాటియా

చెన్నై సూపర్ కింగ్స్: సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, షేక్ రషీద్, ప్రశాంత్ సోలంకి

ఇరు జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..