
పృథ్వీ షా.. కొన్నేళ్ల క్రితం ఇండియన్ క్రికెట్‌లో మారుమోగిన పేరు. నెక్ట్స్ సచిన్ అంటూ అతన్ని అంతా ఆకాశానికి ఎత్తేశారు. కానీ, ఎంత స్పీడ్‌గా టీమిండియాలోకి దూసుకొచ్చాడు.. అంతే స్పీడ్‌గా కనుమరుగైయ్యాడు. వివాదాలతో వార్తల్లో నిలిచినా.. బ్యాట్‌తో టీమిండియాలో నిల్చోలేకపోయాడు. బ్యాడ్ బాయ్‌గా పేరుతెచ్చుకున్న ఈ యంగ్ క్రికెటర్.. తాజాగా తాను తప్పు చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో.. వావ్ ఇండియాకు మరో సచిన్ దొరికేశాడంటూ ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఓ ఐదు టెస్టులు, ఆరు వన్డేలు ఆడి.. టీమిండియాకు దూరం అయ్యాడు. ఐపీఎల్లో అదరగొడుతున్నా.. కొన్నేళ్లుగా అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం 25 ఏళ్ల వయసులో ఉండి.. ఐపీఎల్ 2025 కంటే ముందు జరిగిన మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో మనోడికి దిమ్మతిరిగి.. జ్ఞానం బోధపడినట్లు ఉంది.
తాను ఏం చేస్తున్నాడో ఇప్పుడు తనకు అర్థమై ఉంటుంది. కొంతమంది స్నేహితులు తనను తప్పుదోవ పట్టించారని, గతంలో 8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని, ఇప్పుడు 4 గంటలు కూడా చేయడం లేదు, గత రెండేళ్లలో నేను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. కానీ, ఇక నుంచి అలా ఉండదు. డొమెస్టిక్ క్రికెట్ ఆడే సమయంలో రోహిత్ శర్మతో మాట్లాడాను.. ఎలా కమ్‌బ్యాక్ ఇవ్వాలో అతను నాకు సలహా ఇచ్చాడు అని పృథ్వీ షా వెల్లడించాడు. దీంతో.. మళ్లీ టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు పృథ్వీ షా గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక తన కష్టకాలంలో ఏ పెద్ద క్రికెటర్ కూడా తనతో మాట్లాడలేదని, కేవలం రిషభ్ పంత్, సచిన్ టెండూల్కర్ మాత్రమే తనకు అండగా నిలిచారంటూ పృథ్వీ షా కాస్త ఎమోషనల్ అయ్యాడు.
అయితే.. ఇప్పుడు పృథ్వీ షా ఫోకస్ మొత్తం తన ప్రాక్టీస్ మీదే పెట్టినట్లు సమాచారం. ఐపీఎల్‌లో అన్‌సోల్డ్‌గా మిగలడం, డొమెస్టిక్ క్రికెట్‌లో కూడా సరిగ్గా రాణించకపోవడంతో తన క్రికెట్ కెరీర్‌కు పుల్‌స్టాప్ పడే ప్రమాదం ఉందని గ్రహించిన షా.. తన కమ్‌బ్యాక్‌పై దృష్టి పెట్టాడు. ఇటీవలె డొమెస్టిక్ క్రికెట్‌లో వేరే టీమ్‌కు ఆడేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కూడా తీసుకున్నాడు. సరైన ఫామ్‌లో లేకపోవడంతో రంజీ టీమ్ నుంచి షాను డ్రాప్ చేయడంతో ఇక ముంబై జట్టులో ప్లే దొరకడం కష్టమని భావించిన షా, ముంబైని వీడాలని నిర్ణయించుకున్నాడు. తన కెరీర్‌పై ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇటీవలె ఎంసీఏ కూడా అతనికి ఎన్‌ఓసీ ఇచ్చింది. మరి పృథ్వీ షా త్వరలోనే కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం..
Prithvi Shaw said “I made lots of mistakes in the last 2 Years, Stopped giving Time to Cricket, some Friends Distracted me”. [Vaibhav Bhola on News 24 Sports] pic.twitter.com/9CqM5ZWzur
— Johns. (@CricCrazyJohns) June 25, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి