AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragyan Ojha: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. తన జీతం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

Pragyan Ojha: బీసీసీఐ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ప్రగ్యాన్ ఓజా నియమితులయ్యారు. మీడియా కథనాల ప్రకారం ఆయనకు ఏడాదికి రూ.3 కోట్లు, నెలకు సగటున రూ.25 లక్షల శాలరీ అందవచ్చని తెలుస్తోంది. భారత జట్టు తరఫున 24 టెస్టుల్లో 113 వికెట్లు తీసిన ఓజా, ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్‌కు ఆడారు.

Pragyan Ojha: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. తన జీతం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే
Pragyan Ojha
Rakesh
|

Updated on: Oct 19, 2026 | 7:28 PM

Share

Pragyan Ojha: భారత క్రికెట్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. టీమిండియా పురుషుల సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్‌గా ఆయనను బీసీసీఐ అధికారికంగా నియమించింది. అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఓజా తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు అదే బాధ్యతల్లో ఆయన కొనసాగనున్నారు. మరోవైపు మాజీ భారత క్రికెటర్ రమేశ్ పవార్‌కు కూడా సెలక్షన్ కమిటీలో చోటు దక్కింది. అయితే ఓజాకు ఈ పదవితో ఎంత జీతం వస్తుంది? ఆయన క్రికెట్ కెరీర్ ఎలా సాగింది? అనే విషయాలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.

ఏడాదికి రూ.3 కోట్లు

మీడియా కథనాల ప్రకారం.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజాకు ఏడాదికి రూ.3 కోట్ల రెమ్యునరేషన్ లభించనుంది. అంటే నెలకు సగటున రూ.25 లక్షలు అన్నమాట. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన అజిత్ అగార్కర్‌కు కూడా ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ అందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రజ్ఞాన్ ఓజా వేతనానికి సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు సాధారణ క్రికెట్ ఉద్యోగం లాంటివి కావు. వివిధ ఫార్మాట్లకు భారత జట్టును ఎంపిక చేయడం, ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించడం, జట్టు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఈ పదవి కీలకంగా ఉంటుంది.

ఓజా కెరీర్ ఇదే

ప్రజ్ఞాన్ ఓజా 2009 నుంచి 2013 మధ్య భారత జట్టు తరఫున 24 టెస్టులు ఆడారు. ఈ ఫార్మాట్‌లో 113 వికెట్లు పడగొట్టారు. అంతేకాదు, 18 వన్డేల్లో 21 వికెట్లు, ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశారు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌గా తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. టెస్టు క్రికెట్‌లో ఆయనకున్న అనుభవమే ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ పదవికి ప్రధాన అర్హతగా నిలిచింది. సెలక్షన్ కమిటీలోని ఐదుగురు సభ్యుల్లో అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడు కావడంతో సీనియారిటీ ఆధారంగా ఓజాకు చైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఐపీఎల్‌లోనూ ఓజా సత్తా

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ప్రజ్ఞాన్ ఓజా తనదైన ముద్ర వేశారు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 2011 వరకు ఆ జట్టులో కొనసాగిన ఆయన, 2012లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరారు. 2015 వరకు ఐపీఎల్‌లో ఆడారు. ఆ తర్వాత కామెంటరీ రంగంలోనూ కనిపించారు. ఆటగాడిగా సాధించిన అనుభవం, క్రికెట్‌పై అవగాహన ఇప్పుడు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఆయనకు ఉపయోగపడనున్నాయి. భారత జట్టు ఎంపికలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, సీనియర్ ఆటగాళ్లను సరైన రీతిలో ఎంపిక చేయడం వంటి అంశాలు ఆయన ముందున్న కీలక బాధ్యతలు.

రమేశ్ పవార్‌కు సెలక్షన్ కమిటీలో చోటు

ప్రజ్ఞాన్ ఓజాను చైర్మన్‌గా నియమించిన బీసీసీఐ, రమేశ్ పవార్‌ను కూడా పురుషుల సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా చేర్చింది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత పవార్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. పవార్ భారత జట్టు తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత భారత మహిళల జట్టుతో పాటు ముంబై, గుజరాత్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించారు. ఇప్పుడు ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలోని కమిటీలో శివ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రాలతో కలిసి పవార్ పనిచేయనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us