Rajiv Gandhi International Cricket Stadium, Uppal:ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చీకల్లు అలముకున్నాయి. విద్యుత్ బిల్లులు బాకీపడడంతో హెచ్‌సీఏకు( హైదరాబాద్ క్రికెట్ సంఘం) విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. రూ.3 కోట్లకు పైగా కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో స్టేడియంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఈమేరకు ఉప్పల్ స్టేడియంలో కరెంట్ సరఫరా నిలిపివేసినట్లు ఏడీఈ బాలకృష్ణ మంగళవారం వెల్లడించారు. విద్యుత్ బిల్లులు చెల్లించడంలో హెచ్‌సీఏ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, అలాగే విద్యుత్‌ను యధావిధిగా వాడుకుంటున్నారని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
హెచ్‌సీఏపై గతంలోనూ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈవిషయంపై హెచ్‌సీఏ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే తీర్పు విద్యుత్తు శాఖకు అనుకూలంగా రావడంతో హెచ్‌సీఏకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ బకాయిలపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపేసినట్లు అధికారులు పేర్కొన్నారు.