MLC 2025: మళ్లీ గ్రౌండ్‌లోకి దిగిన పొలార్డ్.. దిగీ దిగడంతోనే విరాట్ కోహ్లీ రికార్డ్ లేపేశాడు..!
మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీరన్ పోలార్డ్ 32 పరుగులు చేసి టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. 618 ఇన్నింగ్స్‌లలో 13569 పరుగులు సాధించిన పోలార్డ్, కోహ్లీని 26 పరుగుల తేడాతో దాటాడు. అత్యధిక టీ20 పరుగుల జాబితాలో క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్ ముందున్నారు.

మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో MI న్యూయార్క్ తరపున కీరన్ పొలార్డ్ 32 పరుగులు చేసి టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్‌లో (ఐపీఎల్, ఇంటర్నేషనల్ కలిపి) విరాట్ కోహ్లీ 397 ఇన్నింగ్స్‌లు ఆడి 13543 పరుగులు చేశాడు. తాజాగా ఈ మార్క్‌ను పోలార్డ్ అధిగమించాడు. టాక్సాస్ సూపర్ కింగ్స్‌పై ఆడిన 32 పరుగుల ఇన్నింగ్స్‌తో పొలార్డ్ 618 ఇన్నింగ్స్‌ల్లో 13569 పరుగులు సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్.. మేజర్ లీగ్ క్రికెట్‌లో మాత్రం ఎంఐ న్యూయార్క్ తరఫున ఆడుతున్నాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్లో పొలార్డ్‌ను అధిగమించిన కోహ్లీ టీ20 క్రికెట్‌లో 13,543 పరుగులు సాధించాడు. ఇప్పుడు పొలార్డ్ కోహ్లీని దాటేశాడు. కోహ్లీ కంటే పొలార్డ్ 26 పరుగులు ముందున్నాడు. అయితే టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ టాప్ వన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత అలెక్స్ హేల్స్, మూడో స్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఉన్నాడు. కాగా షోయబ్ మాలిక్‌ను అధిగమించడానికి పొలార్డ్ కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నాడు. మాలిక్‌ను కూడా పొలార్డ్ ఈజీగా దాటేసి.. ఈ జాబితాలో త్వరలోనే టాప్ 3కి చేరుకునే సూచనలు మెండుగా ఉన్నాయి.
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వీరులు
- 14,562 – క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్‌లు)
- 13,704 – అలెక్స్ హేల్స్ (493 ఇన్నింగ్స్)
- 13,571 – షోయబ్ మాలిక్ (515 ఇన్నింగ్స్)
- 13,569 – కీరాన్ పొలార్డ్ (618 ఇన్నింగ్స్)
- 13,543 – విరాట్ కోహ్లీ (397 ఇన్నింగ్స్)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




