Phil Salt IPL Auction 2025: కెప్టెన్‌ మెటీరియల్‌ని పట్టేసిన బెంగళూరు.. ఎంత ఖర్చు చేసిందంటే?

Phil Salt IPL 2025 Auction Price: ఆదివారం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఇంగ్లీష్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను రూ.11.50 కోట్లకు ఒప్పందం చేసుకుంది. IPL 2025 కోసం కెప్టెన్సీని కూడా చేపట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తీవ్రంగా పోరాడిన బెంగళూరు జట్టు చివరకు రూ. 11.50 కోట్లతో సంతకం చేసుకుంది..

Phil Salt IPL Auction 2025: కెప్టెన్‌ మెటీరియల్‌ని పట్టేసిన బెంగళూరు.. ఎంత ఖర్చు చేసిందంటే?
Phil Salt

Updated on: Nov 24, 2024 | 8:12 PM

ఆదివారం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఇంగ్లీష్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను రూ.11.50 కోట్లకు ఒప్పందం చేసుకుంది. IPL 2025 కోసం కెప్టెన్సీని కూడా చేపట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తీవ్రంగా పోరాడిన బెంగళూరు జట్టు చివరకు రూ. 11.50 కోట్లతో సంతకం చేసుకుంది.

తమ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసిన తర్వాత బెంగళూరు జట్టు 2025 ఎడిషన్ కోసం కొత్త కెప్టెన్ కోసం వేటలో పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిన తమ మాజీ స్టార్ కేఎల్ రాహుల్‌ను ఆర్‌సిబి తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ, కుదరలేదు. చివరకు రూ. 11.50 కోట్లకు సాల్ట్‌ను దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నం.2 T20I బ్యాటర్ అయిన సాల్ట్, జోస్ బట్లర్ తర్వాత ఇంగ్లాండ్ కొత్త వైట్-బాల్ కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. గత సీజన్ చివరిలో దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ తర్వాత ఛాలెంజర్స్ కొత్త వికెట్ కీపర్ కోసం ఎదురుచూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..