Pakistan vs Bangladesh Test: ఆగస్టు 21 నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. స్వదేశంలో జరిగే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు లేకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది. ఎందుకంటే గత ఏడాది కాలంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. అందుకే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌ల టిక్కెట్ ధరను తగ్గించింది. ఆశ్చర్యకరంగా అది కూడా కేవలం రూ.15లకే టిక్కెట్లు ఇవ్వడం గమనార్హం.
కరాచీ వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న టెస్టు మ్యాచ్ టిక్కెట్ ధరను ప్రకటించారు. ఇక్కడ సాధారణ టిక్కెట్ ధర రూ.15 మాత్రమే.
2024 పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) సమయంలో, స్టేడియంలలో ప్రేక్షకుల కొరత స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఎలిమినేటర్ లేదా ఫైనల్ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు ఆశించిన స్థాయిలో రాలేదు. ఆసియా కప్‌లో కూడా ఖాళీ స్టేడియాలు కనిపించాయి.
ఇక టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉండదని పీసీబీ ఆందోళన చెందుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టిక్కెట్లను 50 పీకేఆర్ (భారత కరెన్సీలో రూ. 15లు)కి విక్రయించాలని నిర్ణయించింది.
ఈ మ్యాచ్‌ల కోసం ఐదు రోజుల టిక్కెట్లను కొనుగోలు చేసే వారికి ప్రత్యేక తగ్గింపును కూడా ప్రకటించింది. దీని ప్రకారం, వారు పూర్తి ఐదు రోజులు క్రికెట్ చూడాలనుకుంటే, వారికి కేవలం రూ. 72 (పీకేఆర్ 215)కే పాస్‌ను అందిస్తున్నారు.
దీని ద్వారా టెస్టు క్రికెట్‌కు ప్రేక్షకులను రప్పించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసింది. దీని ప్రకారం బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్ సందర్భంగా స్టేడియం కిక్కిరిసిపోతుందో లేదో చూడాలి.
పాకిస్థాన్ టెస్టు జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ అఫ్రిది.
బంగ్లాదేశ్ టెస్ట్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మద్ హసన్ జాయ్, జకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ కుమార్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్ ఇస్లాం , హసన్ మహమూద్, హసన్ తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..