AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పాకిస్థాన్ ఓటమితో కోపోద్రిక్తుడైన పీసీబీ చీఫ్.. భారత జర్నలిస్టుతో అనుచిత ప్రవర్తన.. ఫైరవుతోన్న నెటిజన్లు..

దుబాయ్‌లో రమీజ్ రాజా BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కలిసి ఆసియా కప్ చివరి మ్యాచ్‌ని వీక్షించాడు. కానీ, ఫైనల్‌లో పాకిస్తాన్ ఓడిపోవడంతో, ఆయన కోపం కట్టలు తెంచుకుంది.

Watch Video: పాకిస్థాన్ ఓటమితో కోపోద్రిక్తుడైన పీసీబీ చీఫ్.. భారత జర్నలిస్టుతో అనుచిత ప్రవర్తన.. ఫైరవుతోన్న నెటిజన్లు..
Asia Cup 2022 Final Ramiz Raja
Venkata Chari
|

Updated on: Sep 12, 2022 | 12:58 PM

Share

కోపంలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఎందుకంటే కోపం మనలోని ఆవేశాన్ని రెట్టింపు చేయడంతో, మనపై మనకు కంట్రోల్ తప్పుతుంది. ఇందుకు ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా కూడా ఇలాంటి తప్పే చేశారు. దుబాయ్‌లో, రమీజ్ రాజా BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో కలిసి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించాడు. కానీ, ఫైనల్‌లో పాకిస్తాన్ ఓడిపోవడంతో, అక్కడి నుంచి బయటపడ్డాడు.  ఈ క్రమంలో భారత జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులుగా, అతను ఆవేశంగా ప్రవర్తించాడు.

ఆరోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న శ్రీలంక..

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఆరోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ ఓడి పాకిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించడం విశేషం. సాధారణంగా దుబాయ్‌లో టాస్ గెలిచిన జట్టు మ్యాచ్‌లో కూడా గెలుపొందడం ట్రెండ్. అయితే, టాస్ ఓడిన శ్రీలంక ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.

View this post on Instagram

A post shared by Khel Shel (@khelshel)

ఆగ్రహంతో దూకుడు..

ఆసియా కప్ 2022 ఫైనల్‌లో పాకిస్థాన్ ఓటమి తర్వాత , PCB ఛైర్మన్ రమీజ్ రాజాను జర్నలిస్టులు చుట్టుముట్టారు. ఈ సమయంలో, భారతీయ జర్నలిస్ట్ అతని ముందు తన ప్రశ్నను ఉంచాడు. పాక్ టీమ్ ఓటమితో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని అడిగాడు. ఇది విన్న రమీజ్ రాజు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఈ వీడియోలో, రమీజ్ రాజా ఎంత కోపంతో ఉన్నాడో వీడియో చూస్తే తెలిసిపోతుంది. పీసీబీ చైర్మన్‌గా ఉన్న ఆయన ఓ భారతీయ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా మీరు ఇండియా నుంచి వచ్చారా అంటూ అసంబద్ధమైన ప్రశ్న వేశాడు. ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత, ఆ జర్నలిస్టు మొబైల్‌ను కూడా లాక్కున్నారు. ఒక దేశ క్రికెట్ బోర్డు అత్యున్నత పదవిలో కూర్చున్న వ్యక్తిచేయాల్సిన పని కాదు. కానీ, ఇలా ప్రవర్తించడంతో ఇప్పుడంతా ఆయనను తిట్టిపోస్తున్నారు.